ETV Bharat / state

మియాపూర్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని దారుణ హత్య - అతడి పనేనా? - Software Woman Murdered in Miyapur - SOFTWARE WOMAN MURDERED IN MIYAPUR

Young Software Woman Murdered in Hyderabad : వివాహితను తన ఇంట్లో పదునైన ఆయుధంతో హత్య చేసిన ఘటన మియాపూర్​లో స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల క్రితం భర్త వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విడాకుల కేసు కోర్టులో ఉండగానే తను హత్యకు గురైంది.

Young Software Woman Was Murdered in Miyapur
Young Software Woman Was Murdered in Miyapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 1:28 PM IST

Updated : Oct 1, 2024, 1:57 PM IST

Young Software Woman Was Murdered in Miyapur : వివాహితను పదునైన ఆయుధంతో ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన మియాపూర్​లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీప్తిశ్రీనగర్​ సీబీఆర్​ ఎస్టేట్​ 3ఏ బ్లాక్​లో ఉండే ప్రైవేట్ స్కూల్​ టీచర్​ కుమార్తె బండి స్పందన (29) సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇంటర్ చదువుతున్న సమయంలో అదే కాలనీకి చెందిన వినయ్​ కుమార్​ను ప్రేమించింది. 2022 ఆగస్టులో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్​. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ మియాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. వారిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.

తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఇద్దరు కొడుకులు- 30ఏళ్ల తర్వాత మూడో సన్ ఎంట్రీతో! - Father Murdered And Buried

సోమవారం తల్లి తాను పని చేస్తున్న పాఠశాలలో విధులకు వెళ్లగా, స్పందన ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వారింటికి సమీపంలో నివాసం ఉండే సోదరి వచ్చి ఇంటి తలుపు తడితే తీయలేదు. దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. సాయంత్రం స్కూల్​ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్​ బెల్​ నొక్కినా తీయలేదు. స్పందన ఫోన్​కు కాల్​ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి తెరిచి చూడగా అప్పటికే హత్యకు గురైంది.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచినట్లు కనిపిస్తున్నాస అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు. హత్య చేసింది తెలిసిన వారేనా? అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు. అపార్టుమెంట్​తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీనీ పరిశీలిస్తున్నామన్నారు.

షాద్​నగర్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య - మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్​లో చుట్టి!

ఆస్తి కోసం హత్య - కన్న తండ్రినే కడతేర్చిన కసాయి బిడ్డలు

Last Updated : Oct 1, 2024, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.