ETV Bharat / state

కూర్చోలేడు, నడవలేడు - వెన్నుపూస దెబ్బతిని జీవచ్ఛవంలా యువకుడు - దాతల సాయం కోసం ఎదురుచూపులు - Young Man Seeking Help

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 1:18 PM IST

Young Man Seeking Help : అతనిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ పూట గడవని పరిస్థితి. కుటుంబ పోషణకు కూలీ పనికి వెళ్లగా విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి నడవలేని స్థితికి చేరాడు. లక్షలు ఖర్చు పెట్టి వెన్నముక శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేదు. ఇటువంటి దీనస్థితిలో సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లతండాకు చెందిన రమేశ్​ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.

Man Seeking Help after Suffering From Spine Broken
Young Man Seeking Help (ETV Bharat)

Man Seeking Help after Suffering From Spine Broken : జీవచ్ఛవంలా పడి ఉన్న ఇతని పేరు గుగులోతు రమేశ్​. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లతండాకు చెందిన ఈయనకు భార్య, కుమారుడు ఉండగా కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేళ్ల క్రితం మామిడి కాయలు కోసేందుకు కూలీగా వెళ్లాడు. విధి వక్రికరించి ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు.

వెంటనే ఆస్పత్రికి సూర్యాపేటకు తరలించగా వెన్నపూస దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స అందించారు. వెన్నుముకకు శస్త్రచికిత్స చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రమేశ్​ నడుము కింది భాగం పనిచేయట్లేదు. ఎలాంటి స్పర్శా లేదు. తనంతట తాను లేచి కూర్చోలేడు, నడవలేడు. మంచం నుంచి లేవాలంటే ఒకరి సాయం కావాలి. ప్రస్తుతం అతడిని భార్య చంటి బిడ్డలా చూసుకుంటోంది.

'ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడిపోయా. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్తే వెన్నపూస విరిగింది, ఆపరేషన్​ చేస్తే నడుస్తే నడుస్తావ్​ లేదంటే లేదు అని అన్నారు. ఆసుపత్రి ఖర్చు మొత్తం రూ.10 లక్షల వరకు అయ్యింది. ప్రస్తుతం మంచం మీదే జీవచ్ఛవంలా పడి ఉన్నా. దీంతో అప్పుల పాలయ్యాం. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుకుంటున్నా'- రమేశ్​, బాధితుడు

రూ. 10 లక్షలు ఖర్చు చేసిన దక్కని ఫలితం : తల్లిదండ్రులు రోజువారి కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నాడు. వైద్య ఖర్చులతోపాటు కుటంబ పోషణకు భారంగా ఉందని వాపోతున్నాడు. 10 లక్షల రూపాయలు వరకు అప్పు తీసుకొచ్చి చికిత్సకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని రమేశ్‌ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛను కూడా రావడం లేదని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకున్నారు.

'తెలిసిన వాళ్ల దగ్గర, బయట వాళ్ల దగ్గర అప్పు తీసుకుని నా భర్తకు ఆపరేషన్​ చేయించాం. ఆయన చెట్టు మీద నుంచి కింద పడి సంవత్సరం అవుతోంది. తను ఎప్పుడూ మంచంలోనే ఉంటున్నాడు. నా భర్త దగ్గర 24 గంటలు ఉండాల్సి వస్తోంది. నా పిల్లలను పోషించుకుందామంటే జీవనాధారం లేదు. బయటకి వెళ్లి పని చేద్దామని అనుకున్నా, నా భర్తను చూసుకోవాల్సి వస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేయాలని కోరుతున్నా'- స్వప్న, బాధితుడి భార్య

బాధ్యత చూసేవాడే బరువయ్యాడు - ఆపన్నహస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదరుచూపులు - Seeking Help For Son Treatment

ఆ కుటుంబానికి ఎంత కష్టమొచ్చింది - ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూపు - A Poor Family Waiting For Helping Hands

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.