Young Man Murder in Pragathi Nagar : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి, ఆపై బండరాయితో మోది చంపారు. హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఆర్ నగర్‌లోని దాసారం బస్తీలో నివాసం ఉండే తేజస్ అలియాస్ సిద్ధూ (21) గత సంవత్సరం స్థానికంగా జరిగిన అరుణ్ అనే యువకుడి హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అతడు, 2 నెలల క్రితం విడుదలయ్యాడు.
ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి ప్రగతినగర్‌లోని బతుకమ్మ కుంటకు మకాం మార్చాడు. అక్కడ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తేజస్ తల్లి ఊరు వెళ్లింది. దాంతో ఒంటరిగా ఉన్న అతడు, తన స్నేహితులు మహేశ్, శివప్ప, సమీర్‌లను ఇంటికి పిలిపించుకున్నాడు. అందరూ కలిసి అర్ధరాత్రి దాటే దాకా మద్యం సేవించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బైక్‌పై ఓ ముగ్గురు గుర్తు తెలియని యువకులు వచ్చి పని ఉందంటూ తేజస్‌ను ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్ వద్దకు తీసుకెళ్లారు.
ఇద్దరు చిన్నారుల దారుణ హత్య- ఇంట్లోకి వెళ్లి గొంతుకోసి పరార్- ఎన్కౌంటర్లో నిందితుడి హతం
హత్య చేసి, ఇన్‌స్టాలో పోస్టు పెట్టి : ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, తేజస్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. 11 చోట్ల కత్తి గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని బండరాయితో మోది హతమార్చారు. అంతటితో ఆగకుండా హత్య తర్వాత ఆ దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అరుణ్ మర్డర్‌కు ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం.
సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య
ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి ఏసీపీ కె. శ్రీనివాస రావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలను రప్పించగా, అవి చుట్టుపక్కల తిరిగి ఆగిపోయాయి. అనంతరం తేజస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మర్డర్‌కు పాల్పడిన నిందితులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లారీతో తొక్కించి ఐదుగురి హత్య- ఘర్షణపై కేసు పెట్టేందుకు వెళ్తుండగానే