ETV Bharat / state

విశాఖలో మరో కొండకు గుండు కొడుతున్న వైసీపీ నేతలు - భారీ యంత్రాలతో తవ్వకాలు - Illegal Excavations on Hill

YSRCP Leaders Illegal Excavations on Hill : ఏపీలో రుషికొండకు బోడిగుండు గీసిన అధికార వైసీపీ నేతలు, విశాఖలోనే మరో కొండను చెరబట్టారు. మధురవాడలోని ఓ కొండను భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. కొండ చుట్టూ ఉన్న చెట్లన్నీ నరికేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. విచ్ఛలవిడి తవ్వకాలతో కొండను మాయం చేసే పనిలో పడ్డారు. బండరాళ్లు జారిపడుతుండటంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు

Illegal excavations in Vizag
YSRCP Leaders Illegal Excavations on Hill
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 10:27 AM IST

విశాఖలో మరో కొండకు గుండు కొడుతున్న వైసీపీ నేతలు - భారీ యంత్రాలతో తవ్వకాలు

YSRCP Leaders Illegal Excavations on Hill : ఏపీలో వైసీపీ నేతల అక్రమార్జన దాహానికి కొండలు కరిగిపోతున్నాయి. కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. గ్రావెల్‌ను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. అధికార యంత్రాంగం నిద్ర నిటిస్తోంది. ప్రభుత్వమే ప్రాజెక్టుల పేరుతో విధ్వంసానికి పాల్పడుతుండగా, వైసీపీ నాయకులు ఏకంగా కొండలనే మింగేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రుషికొండను బోడిగుండులా మార్చారు. తెన్నేటిపార్కు వద్ద కైలాసగిరి వాలులో భారీగా తొలిచేశారు.

ప్రస్తుతం ఇదే తరహాలో మధురవాడలోని న్యాయకళాశాల - రుషికొండ రోడ్డులో పనోరమ హిల్స్‌ ప్రాంతంలో పెబిల్‌ బీచ్‌ టవర్స్‌ ఎదురుగా, అదానీ డేటా సెంటర్‌ను ఆనుకొని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపలి వరకున్న కొండవాలులో, పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. ముందుగా కొండపై చెట్లను పెకిలించి పొదలను తొలగించేశారు. వాలు మొత్తాన్ని నామరూపాల్లేకుండా చేశారు.

Hills Excavation in AP : తవ్విన గ్రావెల్‌ సమీప రోడ్డుపై పడుతోంది. అక్కడి విద్యుత్తు స్తంభాల మధ్య వరకు మట్టి నిండిందంటే ఎంతలా తవ్వేశారో స్పష్టమవుతోంది. 10 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్విన ఆనవాళ్లు పర్యావరణ విధ్వంసానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రుషికొండను తవ్వేసిన తరహాలోనే దీన్ని విధ్వంసం చేస్తుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయిదేళ్లుగా ప్రజలకు నరకం చూపించి - ఎన్నికల ముందు ఎందుకీ హడావుడి?

కొండను కబ్జా చేయాలన్న లక్ష్యంతోనే కేవలం రాత్రిళ్లు తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న చోట ఓ అంతర్జాతీయ సంస్థకు పాఠశాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాలు కేటాయించింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒకవేళ అదే సంస్థ పనులు చేస్తుందనుకున్నా, అక్కడి పనుల తీరు చూస్తుంటే 20 నుంచి 30 ఎకరాల వరకు తవ్వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేటాయింపులకు మించి ఎలా తొలిచేస్తారనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ చదరపు గజం 60 వేల రూపాయల వరకు ఉంది. విలువైన స్థలం కావడంతో కేటాయింపు ముసుగులో మరికొంత ఆక్రమించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Vizag Hills Illegal Excavations : అంతర్జాతీయ విద్యాసంస్థకు విలువైన స్థలం కేటాయించడంపైనా విమర్శలున్నాయి. 12 ఎకరాలను బహిరంగ మార్కెట్‌ విలువ కన్నా తక్కువకు అప్పగించారు. ప్రభుత్వంలో ముఖ్య నేతకు సంబంధం ఉండటంతోనే ఇలా కేటాయించారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు విస్తరణను సైతం కుందిచేలా ఒత్తిళ్లు తెచ్చారని అంటున్నారు.

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ- వీఎంఆర్‌డీఏ 2041 బృహత్తర ప్రణాళికలో పలు సర్వే నంబర్లలో వంద అడుగుల రోడ్డుకు ప్రతిపాదించారు. తాజాగా ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికారులు మాత్రం వీఎంఆర్‌డీఏకు చెందిన స్థలంలో నుంచి రోడ్డు వెళ్తుండటంతోనే వెడల్పు తగ్గించామని చెప్పుకొస్తున్నారు.

కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన

జనాలను హడలెత్తించిన సీఎం సభ- ఇంట్లో ఉన్నవారు సేఫ్! బస్సుల బంద్​కు తోడు పోలీసు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.