ETV Bharat / state

రాష్ట్రంలో జోరుగా యాసంగి సాగు - అంచనాలకు మించి సాగైన ఆహార, ఆరుతడి పంటలు - Yasangi Season in Telangana 2024

Yasangi Cultivation in Telangana : రాష్ట్రంలో యాసంగి పంటల సాగు చాలా ఆశాజనకంగా ఉంది. ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, జొన్న వంటి ఆరుతడి పంటలు విస్తీర్ణంలో అంచనాలకు మించి సాగవుతున్నాయి. నాగర్‌కర్నూల్​, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ, అదనపు వర్షపాతం నమోదైనందున పైర్ల సాగుకు ఢోకా లేకుండాపోయింది. రైతుల కోసం సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

Yasangi Crop in Telangana
More Outcome in Yasangi Crop in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 8:35 AM IST

రాష్ట్రంలో జోరుగా యాసంగి సాగు

Yasangi Cultivation in Telangana : రాష్ట్రంలో యాసంగి (Yasangi Sagu)వ్యవసాయ పంటల సాగు సరళి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో దాదాపు అన్ని రకాల పంటలు లక్ష్యాలకు అనుగుణంగా సాగయ్యాయి. వాతావరణం ఆశాజనంగా ఉండటం, నీటి వనరులు అందుబాటులో ఉన్నందున సాగుకు ఢోకా లేదని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణం 54,93,444లు ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు ఏకంగా 60,88,000ల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి.

వ్యవసాయ శాఖ అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా 110 శాతం మేర పంటలు సాగవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నందున ఆయకట్టు పెరిగింది. ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 40,50,000ల ఎకరాలు నిర్దేశించగా ఇప్పటికి 46,28,000ల ఎకరాల్లో సాగవుతోంది. అనూహ్యంగా 5 లక్షల ఎకరాలుపైనే రైతులు వరి వేశారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 5,11,000ల ఎకరాలు కాగా ప్రస్తుతానికి 8,04,000ల ఎకరాల్లో సాగవుతోంది.

రైతులకు గుడ్​న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్

Yasangi Sagu in Telangana : జొన్న ఊహించనిరీతిలో రెట్టింపు సాగు చేశారు. శనగ 3,38,000ల ఎకరాలు అనుకుంటే ఇప్పటి దాకా 2,55,000ల ఎకరాల్లో సాగవుతూ వెనకబడిపోయింది. వేరుశనగ సైతం అనుకున్న లక్ష్యం సాధించలేక చతికిలపడిపోయింది. ఆరుతడి పంటలైన నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఇతర నూనెగింజల పంటలు ఆశాజనంగా సాగుతున్నాయని వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది.

Yasangi Season in Telangana 2024 : రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. 25 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురవగా నిర్మల్‌, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లిలో మాత్రమే అదనపు వర్షపాతం నమోదైంది. మొత్తంగా 861 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 914 మిల్లీమీటర్లు కురిసింది.

పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చేనా? - గిట్టుబాటు ధర లేక సాగు తగ్గిస్తున్న రైతులు

మొత్తంగా 22 జిల్లాల్లో 100 శాతం పంటల సాగవుతోంది. కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, గద్వాల్, సూర్యాపేట జిల్లాల్లో 76 నుంచి 100 శాతం సాగు నడుస్తోంది. మంచిర్యాల, భూపాలపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తిలో 51 నుంచి 75 శాతం మేర సాగు పూర్తయింది. ములుగు జిల్లాలో మాత్రమే 26 నుంచి 50 శాతం మేర మాత్రమే పంటల సాగవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట వంటి 4 జిల్లాల్లో 76 నుంచి 100 శాతం సాగు నడుస్తోంది.

మిరప పంటకు తెగుళ్ల ముప్పు - రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలపై ఎఫెక్ట్

యాసంగి పంటకు కావాల్సిన సాగునీరు అందేలా చర్యలు తీసుకోండి - మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.