ETV Bharat / state

యాదాద్రి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - కార్యక్రమాల వివరాలివే - Yadadri Annual Brahmotsavam

Yadadri Brahmotsavam 2024 : యాదాద్రి మహా దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈనెల 21 వరకు జరిగే పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు నేడు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

Yadadri Annual Brahmotsavam
Yadadri Annual Brahmotsavam
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 10:45 AM IST

Yadadri Brahmotsavam 2024 : రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా కొలువై విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేస్తుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను రెండోసారి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Revanth Reddy) పాటు పలువురు రాష్ట్ర మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

Yadadri Temple Varshika Brahmotsavam 2024 : ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల(telugu States) నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

యాదాద్రి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - 25 వరకు వేడుకలు

Yadadri Temple Annual Brahmotsavam : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈఓ రామకృష్ణeరావు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తున్నామన్నారు. తిరుకల్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ప్రభుత్వం(Governmnt) తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 11నుంచి 21వ తేదీ వరకు పలు సేవలను అధికారులు(Officials) రద్దు చేశారు

మార్చి 11 నుంచి బ్రహ్మాత్సవాలు
'స్వామివారి బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వేదపండితుల ద్వారా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. స్వస్తి వాచనంతో కార్యక్రమం ప్రారంభం అయింది. సాయంత్రం అంకురారోపణ, ఉదయం ద్వజారోహణంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు ఇవాళ స్వస్తి పుణ్యాహవాచనంతో శాస్త్రోక్తంగా ప్రారంభమై 21 వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయని' అని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలు సందర్భంగా జరిగే కార్యక్రమాల వివరాలు

  • మార్చి 11వ తేదీ ఉదయం 1వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం
  • 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ
  • 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం
  • 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
  • 15న ఉదయం శ్రీకృష్ణ అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
  • 21న ఉదయం నిర్వహించనున్న అష్టోత్తర శతఘటాభిషేకం
  • శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ఘనంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు - అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్న భక్తులు

యాదాద్రి పాతగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు - రేపటి నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.