ETV Bharat / state

ఇన్నాళ్లకు కల నెరవేరింది - కుటుంబ ఆలనా - పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి - Women Gets 5 Government Jobs

Women Gets 5 Government Teaching Jobs : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది యువత కల. ఈ కొలువులను సాధించడానికి రేయింబవళ్లు చదువుతుంటారు. అలా ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టినా ఉద్యోగం వస్తుంది అని కచ్చితంగా చెప్పలేం. కానీ ఇక్కడ మీరు చూస్తున్న మహిళ ఒక గృహిణి. కుటుంబ ఆలనా పాలనా చూస్తూనే ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించింది.

Women Gets 5 Government Jobs
Women Gets 5 Government Teaching Jobs
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 6:32 PM IST

5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి ఇన్నాళ్లకు కల నేరవేరిందన్న మహిళ

Women Gets 5 Government Teaching Jobs : నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన షర్మిలకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అని కల. కుటుంబంలో అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే కావడంతో తనకు కూడా టీచర్‌ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే విద్యను అభ్యసించిన ఈమెకు ఇంగ్లీషు మాధ్యమం కష్టమనిపించినా రెండు పీజీలతో పాటు బీఈడీ సైతం పూర్తిచేసింది ఈ మహిళ.

సాధించాలనే సంకల్పం ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ముందుకు అడుగేయాలి అంటోంది షర్మిల. భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలని శ్రమించింది. టీచర్‌ ఉద్యోగంపై ఉన్న మక్కువతో ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అయినా, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి చక్కని ప్రణాళికతో పట్టుదలగా పోటీ పరీక్షలపై దృష్టి సారించింది. ఫలితంగా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌ ఉద్యోగాలతో పాటు 2 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను కైవసం చేసుకుంది.

అర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నల్గొండ యువకుడు - Man Got Three Government Jobs Yuva

ఎంతో మంది ఏళ్ల తరబడి పోరాడినా ఫలితం దక్కని సందర్భాలు ఉంటాయి. కానీ ఈ మహిళ అందుకు భిన్నం. ఇంగ్లీషు మాధ్యమంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టువదలకుండా శ్రమించింది. సహజంగా కెమిస్ట్రీ అంటేనే చాలా మందికి అంతుచిక్కని అంశం. అలాంటి సబ్జెక్ట్‌ను అవపోసన పట్టడమేకాకుండా దానితో పాటు జువాలజీ సబ్జెక్ట్‌లో ప్రతిభ కనబరిచి రెండింటిలోనూ జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాలు కైవసం చేసుకుంది. అంతేకాదు భవిష్యత్తులో నీట్​ విద్యార్థులకు బోధిస్తానంటోంది ఈ మహిళ.

"నాకు చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీ టీచింగ్ చేయాలని ఉండేది. ముందుగా నేను అనుకున్న సబ్జెక్టులో రాలేదు. తర్వాత వచ్చింది. తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లీష్​ చాలా కష్టంగా అనిపించింది. ఆరు పరీక్షలు రాస్తే అందులో 5 ఉద్యోగాలు నాకు వచ్చాయి." - షర్మిల

సర్కార్ కొలువు కోసం పట్టు వదలకుండా శ్రమించింది షర్మిల. ఈ క్రమంలో అనేక అవరోధాలను, సమస్యలను ఎదుర్కొంది. చివరకు తన పట్టుదల, కృషి, కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. సాధారణంగా పెళ్లి కాకముందు చదువు ఒక ఎత్తయితే పెళ్లయ్యాక చదవటం అది కష్టతరమైందనే చెప్పవచ్చు. అందులోనూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ చదవటం అసాధ్యమనే చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా పట్టువిడవని సంకల్పంతో సాధన చేసి 5 ఉద్యోగాలను సాధించింది షర్మిల.

ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు

కుటుంబంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ షర్మిల లక్ష్యాన్ని చేరుకున్న తీరు తమకేంతో గర్వకారణమంటున్నారు కుటుంబ సభ్యులు. చదువనేది ఎంతో విలువైన ఆస్తి అని దానిని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే గృహిణిలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నారు

ఎల్లప్పుడు లక్ష్యంపైనే దృష్టి: విజయం కోసం పోరాడే వాళ్లకి సమాజంలో గుర్తింపు రావాలంటే చాలా సమయమే పడుతుంది. దానికి విజేతగా నిలిచి నిరూపించుకోవాలి. చాలా మంది ఈ క్రమంలో వచ్చే అడ్డంకులకు భయపడి లక్ష్యాన్ని వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికి విజయ శిఖరాలను అధిరోహిస్తారు. అలాంటి వారిలో ఇంటిని నడిపించే గృహిణిలు కూడా ఎందరో ఉన్నారు.

4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.