ETV Bharat / state

ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అనే భయం - నిర్మానుష్యంగా మారిన ఆ 3 గ్రామాలు - LAGACHARLA INCIDENT UPDATE

లగచర్ల ఘటనతో నేటికీ ఇళ్లకు రాని పురుషులు - జనసంచారం లేక బోసిపోయిన గ్రామాలు - పగలంతా పొలాల్లోనే ఉంటున్న మహిళలు, పిల్లలు

Lagacharla Incident
Lagacharla Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 9:07 AM IST

Updated : Nov 15, 2024, 2:52 PM IST

Lagacharla Incident : లగచర్ల ఘటన తర్వాత అక్కడి మూడు గ్రామాల్లో జనసంచారం కనిపించడం లేదు. విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడు వచ్చి ఎవరిని పట్టుకుపోతారోనని తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. సోమవారం ఘటన జరిగితే ఇప్పటికీ పురుషులు ఇళ్లకు రాకుండా దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మహిళలు సైతం పిల్లలను తీసుకొని ఉదయం పొలానికి వెళుతున్నారు. సాయంత్రం వరకు అక్కడే గడిపి రాత్రికి బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. లగచర్లలో అయితే కొద్ది మంది జనం అటూఇటూ తిరుగుతూ కనిపించారు కానీ పులిచర్లకుంట తండా, రోటిబండ తండాలు బుధవారం కూడా నిర్మానుష్యంగానే కనిపించాయి.

34 మంది సేఫ్​ : ఘటన తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం మంగళవారం 16 మందిని రిమాండ్​కు తరలించారు. మిగిలిన 34 మందిని విడిచిపెట్టారు. దీంతో వీరంతా ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రధాన నిందితుడు సురేష్​తో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.

Lagacharla Incident
భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడ కట్టడి (ETV Bharat)

3వ రోజు నిలిచిపోయిన ఇంటర్​ నెట్​ సేవలు : లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాల సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. అలాగే తహసీల్దార్​ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇంటర్​ నెట్​ గురించి కొందరు గ్రామాల నుంచి బయటకు వెళుతున్నారు.

ప్రత్యేక బలగాలు మకాం : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసుల బలగాలు బొంరాస్​పేట పోలీస్​ స్టేషన్​లో ఉంటున్నాయి. ఎందుకంటే అవసరం పడితే వెంటనే అక్కడకు పోలీసులు వెళ్లేలా ఉన్నతాధికారులు బలగాలను అక్కడే ఉంచారు.

Lagacharla Incident
న్యాయస్థానం వద్ద పోలీసుల బందోబస్తు (ETV Bharat)

కొడంగల్​ కోర్టు బయట మోహరించిన టీఆర్​ఎస్​ శ్రేణులు : లగచర్ల ఘటన నేపథ్యంలో కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డిని బుధవారం పోలీసులు ఏ-1గా కేసు నమోదు చేయడం తదితర పరిణామాలతో వికారాబాద్​ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను తొలుత వికారాబాద్​ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచారణ నిమిత్తం తరలించగా.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలాగే భారో బందోబస్తును ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్​, పరిగి మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్​, మహేష్​రెడ్డి అక్కడి చేరుకోగా, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు.

బీఆర్​ఎస్​ శ్రేణులు ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకోవడంతో, మాజీ ఎమ్మెల్యేలు కలవడానికి బలవంతపెట్టడంతో నరేందర్​ రెడ్డితో రెండు నిమిషాల పాటు కలవడానికి అనుమతించారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నరేందర్​ రెడ్డి వారితో చెప్పగా ఇక చాలని పోలీసులు వారిని బయటకు పంపించేశారు.

Lagacharla Incident
పోలీసులతో ఎంపీ అరుణ వాగ్వాదం (ETV Bharat)

న్యాయస్థానం వద్ద భారీగా పోలీసుల మోహరింపు : కొడంగల్​ న్యాయస్థానంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్​రెడ్డిని ముందుగా తెలుసుకున్న బీఆర్​ఎస్​ శ్రేణులు అంబేడ్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలపడానికి ప్రయత్నించారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అక్కడకు బలగాలతో భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కొడంగల్​ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీ డీకే అరుణను మహిళా సిబ్బందితో కలిసి పోలీసులు ఆమెను ఆపారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగగా, బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్​, బీజాపూర్​ జాతీయ రహదారి కొంతసేపు వాహనాలతో స్తంభించిపోయింది.

Lagacharla Incident
మాట్లాడుతున్న తిరుపతి రెడ్డి (ETV Bharat)

భూసేకరణకు రైతులను ఒప్పిస్తాం : భూసేకరణకు రైతులను ఒప్పిస్తామని కొడంగల్​ కాంగ్రెస్​ ఇంఛార్జి తిరుపతిరెడ్డి తెలిపారు. లగచర్లలో ఔషధ కంపెనీ కోసం కావలసిన భూములను రైతులను ఒప్పించి, మెప్పించి సాధిస్తామన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి కొడంగల్​ను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. కానీ కేటీఆర్​, హరీశ్​రావుకు ఇది ఇబ్బందిగా ఉందని తెలిపారు. అధికారులపై దాడులు చేయించి బీఆర్​ఎస్​ కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.

కలెక్టర్​పై రాళ్లు, కర్రలతో దాడి - పోలీసుల అదుపులో 55 మంది

కిడ్నాపర్లలా వచ్చి తీసుకెళ్లే దానిని అరెస్ట్ అంటారా : కేటీఆర్

Last Updated : Nov 15, 2024, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.