ETV Bharat / state

కుమార్తెపై కన్నేసిన తండ్రి - గొడ్డలితో హతమార్చిన తల్లి - wife killed her husband - WIFE KILLED HER HUSBAND

Wife Killed her Husband in Sangareddy : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కుమార్తెపైనే కన్నేశాడు. అదును చూసి మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన కన్నతల్లి కట్టుకున్న ఆ కామాంధున్ని గొడ్డలితో కడ తేరిచింది. ఈ విషాదకరమైన ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Wife Killed her Husband in Sangareddy
Wife Killed her Husband in Sangareddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 5:33 PM IST

Wife who Killed her Husband with an Axe in Sangareddy District : కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయి ఆమె తన పుట్టింటికి వచ్చి పుట్టెడు శోకంతో ఉంది. అనంతరం ఆమెకు మరో వివాహం చేశారు. అతనితో కూడా వేధింపులు ఎదురవడంతో పుట్టినింటికి వచ్చేసింది. అల్లుడు చనిపోయాడు, మరో అల్లుడు ఇలా చేశాడని తెలిసి ఆ కన్నకూతురిని ఏ తల్లిదండ్రులు అయినా అనుకుంటారు.

కానీ ఆ కామాంధపు తండ్రి కుమార్తెపైనే కన్నేశాడు. ఆ సమయం చూసి మద్యం మత్తులో కుమార్తెపైనే అత్యాచారయత్నం చేయబోయాడు. ఈ దృశ్యాలను చూసి చలించిపోయిన కన్నతల్లి కట్టుకున్న భర్త అని చూడకుండా కన్నపేగు విలువను చాటి చెబుతూ ఎదురు తిరిగింది. గొడ్డలితో భర్తను కడ తేర్చింది. ఈ విషాదకరమైన ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్​ గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని చౌటుపూరు మండలం సుల్తాన్పూర్​ గ్రామానికి చెందిన మాణయ్య, ఇందిర దంపతులు జీవనం సాగిస్తున్నారు. రోజూ పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్తకు తాగుడు వ్యసనం ఉండటంతో తరచూ ఆ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఏడాది క్రితం పెద్ద కుమార్తెకు వివాహం జరిపించి అత్తారింటికి పంపించారు. అయితే విధి మాత్రం మరోలా తలపించింది. పెళ్లి అయిన కొంతకాలానికే ఆమె భర్త మరణించాడు.

దీంతో ఆమె పుట్టెడు దుఃఖంలో పుట్టింటికి వచ్చేసింది. దీంతో రెండో వివాహం జరిపించినా భర్త వేధింపులు తాళలేక అక్కడి నుంచి కూడా పుట్టింటికి వచ్చేసింది. అక్కడి నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ప్రతి రోజు సంగారెడ్డిలో అడ్డ కూలిగా పని చేస్తూ వారి దగ్గరే ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటుంది. దీనికి తోడు ప్రతి రోజు ఇంట్లో జరుగుతున్న గొడవలను చూసి నాలుగేళ్ల క్రితమే కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సమస్యలతో కుటుంబం సతమతమవుతుంటే తండ్రి పెద్ద కుమార్తెపై కన్నేశాడు. అసలు కన్నపేగు అని చూడకుండా ఆమెను బలాత్కరించాలని చూశాడు. ఆ సమయం కోసం నక్కలా కాచుకుని కూర్చున్నాడు. గత అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుమార్తెలో ఆ తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి ఇందిరా గొడ్డలితో భర్తను హతమార్చింది.

పోలీసుల అదుపులో తల్లి, కుమార్తె : కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పుల్కల్​ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం తల్లి, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

మియాపూర్‌ మైనర్‌ బాలిక హత్యపై వీడిన మిస్టరీ - కన్నతండ్రే కామాంధుడై కడతేర్చినట్లు నిర్ధారణ - Miyapur MINOR GIRL CASE UPDATE

ఆస్తి కోసం బావమరిదిని హత్య చేసిన బావ - కనగల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ - KANAGAL MURDER CASE MYSTERY SOLVED

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.