ETV Bharat / state

ఎంత కష్టం వచ్చిందో! - ఐదో ఫ్లోర్ నుంచి దూకి మహిళ ఆత్మహత్య - WOMAN JUMP TO DEATH 5TH FLOOR - WOMAN JUMP TO DEATH 5TH FLOOR

Woman Committed Suicide Jump from 5th Floor : అపార్ట్​మెంట్​లోని ఐదో ఫ్లోర్ నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్​లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.

Woman Committed Suicide Jump from 5th Floor
Woman Committed Suicide Jump from 5th Floor (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 4:28 PM IST

Updated : Sep 14, 2024, 4:55 PM IST

Woman Jump to Death from 5th Floor : ప్రస్తుత రోజుల్లో ప్రతి సమస్యకు చనిపోవడం ఒక్కటే మార్గంగా ఆలోచించి నిండైనా జీవితాన్ని మధ్యలోనే తుంచుకుంటున్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా నేటితరం మనుషుల్లో కరవైంది. ఎవరైనా మోసం చేసినా, ఓ విషయంపై ఎవరేమన్నా కామెంట్ చేసినా, ఆరోగ్య, ఇంట్లో సమస్యలు ఉన్నా వెంటనే దీర్ఘంగా ఆలోచించి డిప్రెషన్​లోకి వెళ్లిపోతున్నారు. ఆ వెంటనే ఆత్మహత్యనే ఉన్న ఏకైక మార్గంగా భావించి కుటుంబాలను, పిల్లలను వదిలేసి ఆ దారిలో వెళుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఆత్మహత్య అనే ట్రెండ్ బాగా ఎక్కువైంది. కూర బాగోలేదని భర్త అన్నాడని భార్య ఆత్మహత్య, ప్రేమలో విఫలం చెందానని యువతీయువకులు రైళ్ల కిందపడి బలవన్మరణం, వాషింగ్ మిషన్ బాగుచేయించలేదనని ఫ్యాన్​కు ఊరేసుకున్న భార్య, హాస్టల్​లో ఉండలేనని విద్యార్థుల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని నిరుద్యోగుల ఆత్మహత్యలు వంటివి నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే జరిగింది. వివరాలు తెలియకపోయిన అపార్ట్​మెంట్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్​లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్​లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్​మెంట్​లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. అక్కడ ఈ విషయాన్ని స్థానికులు గమనించి కేకలు వేశారు. వారు తెరుకునే లోపు హఠాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు సమాచారం.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు : పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.

వాషింగ్‌ మెషిన్‌ బాగు చేయించలేదని - ఫ్యాన్​కు ఉరివేసుకుని భార్య ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చెరువులోకి తోసేసి - ఆపై తానూ ఆత్మహత్య - ఇబ్రహీంపట్నంలో విషాదం - Mother Suicide With Children

Last Updated : Sep 14, 2024, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.