ETV Bharat / state

'బావా క్షమించు - నా ముఖం చూపించలేక వెళ్లిపోతున్నా' - అసలేం జరిగింది? - Woman Suicide by Loan App - WOMAN SUICIDE BY LOAN APP

Woman Suicide After Realizing She Was Cheated by Loan APP : బావా నేను తప్పు చేశా. కుటుంబం బాగుండాలని నీకు తెలియకుండా ఈ పని చేశా. ఆ తర్వాత తెలిసింది, నేను మోసపోయానని. నా ముఖం నీకు చూపించలేకపోతున్నా. అందుకే మిమ్మలను వదిలి వెళ్లిపోతున్నా. నన్ను క్షమించు బావా, అంటూ ఓ వివాహిత తన భర్తకు సెల్ఫీ వీడియో పంపించి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కారణాలేంటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Woman Suicide After Realizing She Was Cheated by Loan APP
Woman Suicide After Realizing She Was Cheated by Loan APP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 9:47 PM IST

Woman Suicide After Realizing She Was Cheated by Loan APP : ఓ సెల్​ఫోన్​ పచ్చని కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది. చరవాణి​లో ఉన్న ఓ రుణ యాప్‌ కారణంగా అతివ ప్రాణాలు బలైపోయాయి. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆన్‌లైన్‌ మోసానికి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ సెల్ఫీ తీసుకొని మరీ ఓ వివాహిత తనువు చాలించిన దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటుచేసుకుంది.

సంక్షిప్త సందేశాలు చూసి : జిల్లాలోని మంటాడకు చెందిన పేటేటి స్రవంతి(28)కి చరవాణిలో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది. కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడతాయన్న ఆశలో ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తరువాత రూ.60 వేలు వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి మరీ ఓ లక్ష చెల్లించింది. తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని, మోసపోయానని ఆమె గ్రహించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకోలేకపోయింది. తాను తప్పు చేశాననే బాధతో భర్తకు ముఖం కుడా చూపించలేక భర్త శ్రీకాంత్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో జరిగిన విషయాన్ని పుట్టెడు దుఃఖంతో పంచుకుంది.

తల్లిని కోల్పోయిన చిన్నారులు : ‘బావా, తప్పుచేశాను. మన కుటుంబం కోసమే ఈ పని చేశాను. నీకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సెల్ఫీ తీసుకొని స్రవంతి ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఉయ్యూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించిన లాభం లేకపోయింది.

సోమవారం మధ్యాహ్నం స్రవంతి మృతి చెందింది. తన మరణానికి కారణం అంతా వివరిస్తూ చరవాణిలో ఆమె పెట్టిన సెల్ఫీ బయటకు వచ్చింది. స్రవంతికి 6, 4 సంవత్సరాల కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె పుట్టిల్లు పమిడిముక్కల మండలం కృష్ణాపురం కాగా, ఆమె మేనత్త కొడుకు శ్రీకాంత్‌తోనే వివాహమైంది. అతడు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చరవాణిలో ఇలాంటి యాప్‌లను నమ్మవద్దని తాము పదేపదే ప్రచారం చేస్తున్నా కొంతమంది అర్థం చేసుకోలేక ఇలా చిక్కుల్లో పడి పండంటి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని, ఇకనైనా అవగాహనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.

లోన్‌ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? అయితే ఇలా చేయండి - మీ జోలికి అస్సలు రారు! - Loan Recovery Agents Harassment

మీ హోమ్ రెనోవేషన్​ కోసం రుణం కావాలా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - How To Get Loan For Home Renovation

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.