ETV Bharat / state

హార్డ్​ డిస్కుల ధ్వంసం తెచ్చిన తంట - దశాబ్దాల నుంచి సేకరించిన డేటా మొత్తం మాయం - telangana phone tapping case - TELANGANA PHONE TAPPING CASE

Phone Tapping Case Latest Update : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ప్రణీత్‌ రావు చేసిన హార్డ్​ డిస్కుల ధ్వంసంతో గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో అసాంఘిక శక్తలు, మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Phone Tapping Case
Phone Tapping Case Latest Update
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 5:50 PM IST

Phone Tapping Case Latest Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్​రావు చేసిన పనికి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్‌డిస్కుల్లో ఎస్‌ఐబీ దశాబ్దాల నుంచి సేకరించిన డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ధ్వంసం చేసిన వాటిని నాగోల్​లోని మూసీలో పడేయగా, వాటిని పోలీసులు ఎఫ్​ఎస్​ఎల్​కు పంపారు. కానీ వాటిలోని డేటాను రీట్రైవ్ చేయడం అసాధ్యమని అధికారులు తెలిపినట్లు సమాచారం.

మావోయిస్టులు, అసాంఘిక శక్తలపై ఎస్‌ఐబీ సాధారణంగా దృష్టి పెడుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన డేటా అంతా ఎస్‌ఐబీ హార్డ్‌ డిస్కుల్లో భద్రపరిచింది. కాగా 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్‌ డిస్కులు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు, ఆ మొత్తాన్ని తీసుకెళ్లి మూసీలో పడేశాడు. డిసెంబర్ 4న ప్రభుత్వం మారిన తర్వాత భయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేసి, స్వయంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి నాగోల్‌ వంతెన వద్ద మూసీలో కలిపేశాడు. దాంతో దశాబ్దాల నుంచి సేకరించిన సమాచారం అంతా లేకుండాపోయినట్లైంది.

ఫోన్ ట్యాపింగ్​ కోసం ఆ సాఫ్ట్​వేర్​ టూల్ : మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన సాఫ్ట్​వేర్ టూల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కంపెనీ డైరెక్టర్లుగా కన్వర్జెన్స్ పాల్ రవికుమార్ బూసి, శ్రీవల్లి గోడిలు ఉన్నారని తెలిపారు. వీరిద్దరు మరో ఆరు కంపనీలకు సీఈవోలుగానూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు - సాఫ్ట్‌వేర్‌ సమకూర్చుకుంది హైదరాబాద్‌ నుంచే!

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రణీత్‌ రావు బృందం సాంకేతిక నిఘాతో బీఆర్ఎస్‌ ప్రత్యర్థి అభ్యర్థులకు వనరులు అందించే వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేసింది. ఆ సమాచారాన్ని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లోని పోలీసులకు అందించింది. దాని ఆధారంగా సొమ్ము పట్టుకుని, అది ఎన్నికల కమిషన్‌ ఆధీనంలోకి వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక రచించి అమలు చేశారు. ఆ డబ్బుకు హవాలా రంగు పులిమి, పోలీస్ కేసులు నమోదు చేయించి జప్తు చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఫోన్ ట్యాపింగ్‌ ఆపేసినట్లు గుర్తించారు.

ఆధారాల సేకరణ దిశగా దర్యాప్తు ముమ్మరం - సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాల సేకరణ!

ఎస్‌ఐబీలోని 17 కంప్యూటర్లలో ఉన్న 42 హార్డ్‌ డిస్క్‌లను పూర్తిగా తీసేసి, వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ఈ కారణంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సైతం లేకుండాపోయింది. తర్వాత ప్రణీత్​రావు స్వయంగా ఎలక్ట్రీషియన్‌ను తీసుకెళ్లి ఎస్‌ఐబీలోనే హార్డ్‌డిస్క్‌లను ఎలక్ట్రిక్‌ కట్టర్లతో కట్‌ చేయించాడు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి తాను ఒక్కడే ద్విచక్ర వాహనంపై రెండు విడతలుగా మూసీ వద్దకు వెళ్లి ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లను నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో ప్రణీత్‌ రావు నేరం అంగీకరించడంతో పాటు ధ్వంసమైన హార్డ్‌డిస్క్‌ల గురించి చెప్పక తప్పలేదు. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే నాగోల్ బ్రిడ్జి కింద మూసీ నదిలో హార్డ్‌డిస్క్‌ల శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు హైబీపీ - స్టేషన్​లోనే వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.