Wish Fulfillment Pond : ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకే దేవుడిని పూజిస్తారు. దేవుడు తమ కష్టాలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా దేవుడికి మనసులో ఉన్న కోర్కెలను చెప్పుకుంటే నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాంటి వారు ఆ ఐదు రోజుల్లో ఆ చెరువు వద్దకు వెళ్తే కోరిన కోర్కెలు నెరువేరుతాయి. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ? పూజా విధానం ఏంటి? వంటి వివరాలు మీకోసం.
కోర్కెలు తీర్చే చెరువు ఎక్కడుంది? : కోర్కెలు తీర్చే ఈ చెరువు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బారాషాహీద్ దర్గా వద్ద ఉంది. దీనిని స్వర్ణాల చెరువుగా పిలుస్తారు. ఈ చెరువు వద్దకు వెళ్తే కోర్కెలు ఏమైనా నెరవేరుతాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఐదు రోజులపాటు ఈ ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
పూజా విధానం : స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు మార్చుకోవాలి. ఒక్కో కోరికకు అనుగుణంగా ఒక్కో రకమైన రొట్టెను తీసుకోవాలి. కోర్కెలు తీరినవారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చి పంచుతారు. కోర్కెలు తీరిన వ్యక్తి రొట్టెను పంచుతుండగా, అలాంటి కోరికే తీరాలనుకునే మరో వ్యక్తి ఆ రొట్టెను అందుకుంటారు. ఇలా సంపద, ఉద్యోగం, చదువు, సొంత ఇల్లు, వివాహం, ఆరోగ్యం ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారు రొట్టె తీసుకుని తినాలి.
ఇలా ఒక ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకుని కోరిక తీరిన తర్వాత, కచ్చితంగా మళ్లీ వచ్చి రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం. అంటే ఒకసారి ఇక్కడకు వచ్చిన భక్తులు మళ్లీ కచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రొట్టెల పండుగగా పిలుస్తారు.
రొట్టెల పండుగ ఎప్పుడు? : ఈ నెల 17 నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. హిందూ-ముస్లిం ఐక్యతతో నిర్వహించే ఈ ఉత్సవాలను తెలుగుదేశం హయాంలో అధికారిక పండుగలా మార్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్టాల నుంచి 30 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సుమారు రూ.10కోట్ల ఖర్చుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ - ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ డేట్ ఫిక్స్? - Free Bus for Women in AP