Wines Shops Closes in Telangana: మందు బాబులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచీ మద్యం దుకాణాల మూసివేతల పర్వం కొనసాగుతోంది. మే నెలలో కూడా కొనసాగింది. ఇప్పుడు జూన్లో కూడా మరోసారి మద్యం దుకాణాలు మూసేయబోతున్నారు. మరి.. ఎందుకు? మళ్లీ మద్యం దుకాణాలు ఎందుకు మూసేయబోతున్నారు? అది ఎప్పుడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏప్రిల్ నెలలో రెండు రోజులు..
ఏప్రిల్ మాసంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేశారు. శ్రీరామ నవమి సందర్భంగా 17వ తేదీన హైదరాబాద్ జంటనగరాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. శ్రీరాముడి శోభాయాత్ర నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 17న ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ మార్నింగ్ 6 వరకు మద్యం షాపులు మూసి ఉంచారు. ఆ తర్వాత అదే నెల 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా మరోసారి మద్యం దుకాణాలు మూసేశారు.
హీరోయిన్ ప్రణీత బాత్ టబ్ వీడియో - తిట్టిపోస్తున్న ఫ్యాన్స్!
మే నెలలో నాలుగు రోజులు..
మే నెలలో ఏకంగా నాలుగు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ కారణంగా.. మే నెలలో 2 రోజులపాటు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసేశారు. మే 12, 13 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఆ తర్వాత మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా మూసేశారు. మే 26, 27 తేదీల్లో 48 గంటలపాటు మూసేశారు.
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ - నేటి నుంచే అమలు - ఇకపై టెస్ట్ కోసం RTO ఆఫీస్కు వెళ్లనక్కరలేదు!
జూన్ 4న మరోసారి..!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. నేడు (జూన్ 1న) చివరి విడత పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగుస్తుండడంతో.. అందరి దృష్టీ కౌంటింగ్ మీద పడింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున మరోసారి మద్యం దుకాణాలు మూసేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినప్పటికీ.. మద్యం షాపుల బంద్ పక్కాగా ఉంటుందని సమాచారం. ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
గుడ్ న్యూస్ - తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?