ETV Bharat / state

మందు బాబులకు డబుల్ షాక్‌ - ఈ సారి వరుసగా 2 రోజులు వైన్స్‌ బంద్! - WINE SHOPS CLOSE IN TELANGANA - WINE SHOPS CLOSE IN TELANGANA

Wine Shops Close In Telangana : సమ్మర్‌లో కూల్‌ బీర్‌తో రిలాక్స్‌ అవుతున్న మందు బాబులకు బ్యాడ్‌న్యూస్‌. రాష్ట్రంలో రెండు రోజులపాటు వైన్స్‌, బార్‌ షాపులు మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Wine Shops Close
Wine Shops Close In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 12:08 PM IST

Updated : May 9, 2024, 12:15 PM IST

Wine Shops Close In Telangana : మండే ఎండలో కూల్‌ బీర్‌తో ఎంజాయ్‌ చేయాలనుకునే మందు బాబులకు షాక్‌ తగలనుంది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వైన్‌ షాపులు, బార్ షాపులు మూతపడనున్నాయి. మరి, ఆ తేదీలు ఎప్పుడు? దీనికి గల కారణాలేంటి? మళ్లీ మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో అధికారులు మూసివేత నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్‌ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్‌లను సైతం మూతపడనున్నాయి.

11వ తేదీ నుంచే..
మే 11వ తేదీన శనివారం సాయంత్రం 6 నుంచి గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్‌ షాపులను బంద్‌ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. ఓట్ల కౌంటింగ్​ రోజైన జూన్​ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

లైట్​ బీర్ల కోసం యువకుడి పాదయాత్ర - అమ్మకాలు చేపట్టాలని ఆబ్కారీ శాఖకు వినతి పత్రం - Youth Padayatra For Beer

వరుస బంద్​లు..

మందు బాబులకు వరుస బంద్​లు షాకిస్తున్నాయి. గత నెలలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసేశారు. ఈ నెలలో వరుసగా రెండు రోజులు మూత పడనున్నాయి. అటు జూన్​ 4న కౌంటింగ్​ రోజున కూడా మూసివేయనున్నారు. ఇలా వరుస షాకులు తగులుతుండడంతో మద్యం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

బీర్‌లకు భారీ డిమాండ్‌ :
రాష్ట్రంలో ఎండులు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో.. మందుబాబులు వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో చిల్డ్‌ బీర్‌ లాగిస్తూ సేద తీరుతున్నారు. అయితే.. అవి కూడా తగినన్ని అందుబాటులో ఉండట్లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏకంగా ఒక వ్యక్తి 20 రోజుల నుంచి వైన్‌ షాపుల్లో లైట్‌ బీర్‌లను అమ్మడం లేదని.. ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్​ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించాడు. ఇలాంటి పరిస్థితుల్లో.. మద్యం దుకాణాలు రెండు రోజులు మూత పడనుండడంతో మద్యం ప్రియులు వాపోతున్నారు.

ఎన్నికల వేళ భారీ స్థాయిలో మద్యం పట్టివేత- రూ.98 కోట్ల బీర్లు సీజ్​ - 98crore beer seized in Karnataka

ఆ బీర్లలో డేంజరస్ కెమికల్స్.. రూ.25 కోట్లు విలువైన బాటిళ్లు సీజ్

Last Updated : May 9, 2024, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.