Wife and Husband Died in Few Hours Gap : భార్య మెడలో తాళి కట్టిన తర్వాత భర్త ఆమెతో కలిసి అగ్ని సాక్షిగా నీ సుఖాల్లోనూ, బాధల్లోనూ తోడుగా జీవితాంతం కలిసి మెలిసి ఉంటానని చెప్పి ఏడడుగులు వేస్తాడు. పాలు, నీళ్లలా కలిసి అన్యోన్యంగా ఉండాలని అనుకుంటారు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, ఆఖరికి చివరి క్షణంలోనూ కలిసే చావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చాలా మంది ఆఖరి గడియల్లో భగవంతుడిని ప్రార్థిస్తారు. కానీ చివరకి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భార్యభర్తలు కలిసి తుదిశ్వాస విడిచే అవకాశం రాదు. తాజాగా హనుమకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం కేంద్రంలో అన్యోన్య దంపతులు ఒకరి తర్వాత ఒకరు తుది శ్వాసను విడిచారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన పొగాకుల సుగుణమ్మ(70), చేరాలు(80) దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి దాంపత్య జీవితంలో ఏనాడూ కూడా చిన్న తగాదు అంటే రాలేదు. అసలు వారు ఎన్నడైన గొడవపడడం చూడలేదని స్థానికులు తెలిపారు. చివరికి ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు కలిసే వచ్చేవారు. ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ బాగానే ఉండేవారు. ఆ ఆదర్శ దంపతులు ఎప్పుడూ . ఈ క్రమంలో వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తర్వాత సుగుణమ్మ అనారోగ్యానికి గురై గుండెపోటు రావడంతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది.
విషాదం : త్వరగా వచ్చేస్తాం నాన్నా అని.. అమ్మ దగ్గరికి వెళ్లిపోయారు
చివరి నిమిషంలోనూ వీడని బంధం : ఆమె అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించారు. తన భార్య అకాల మరణాన్ని తట్టుకోలేని భర్త చేరాలు మంచం పట్టేశాడు. అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ తాత. భార్య మరణంతో తీవ్రంగా కుంగిపోయి మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్లు వీరి దాంపత్య జీవితాన్ని తలచుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. చివరికి మరణంలోనూ కూడా వారి బంధం విడిపోలేదని గ్రామస్థులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు - గుండెపోటుతో భార్య మృతి