Vikarabad Woman Murder Case Mystery Revealed : ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలతో హత్యలు(Murder) తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వికారాబాద్‌లో మిస్టరీగా మారిన మహిళ హత్య కేసులోనూ ఈ కోణమే బయటపడింది. మరొకరితో చనువుగా మెలుగుతోందన్న అనుమానంతో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ నర్సింలు, ఏఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
వికారాబాద్ మద్గుల్ చిట్టెంపల్లికి చెందిన అవుసుపల్లి బాబు గతంలో ధారూర్ మండలం రాజాపూర్‌కు ఇల్లరికం వెళ్లాడు. గొడవలతో ఏడాదికే భార్యతో విడిపోయాడు. తెల్లాపూర్‌లో అద్దెకు ఉంటూ, పటాన్‌చెరులో ఓ ప్రైవేటు కంపెనీలో నీటి ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల కిందట భర్త మరణించిన చేవెళ్లకు చెందిన అనసూయతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
Woman Murder in Vikarabad : ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బును సదరు మహిళ తిరిగివ్వకపోవడంతో పాటు మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 14న మాయమాటలు చెప్పి వికారాబాద్ మండలం పుల్‌మద్ది శివారులోని ఎవరు లేని ప్రదేశానికి అనసూయను తీసుకెళ్లాడు. మద్యం తాగిస్తూ గొడవ పడి ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఆమె చీర కొంగుతో మెడకు ఉరివేసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీప కాల్వలో వేశాడు. ఒంటిపై ఉన్న అరతులం బంగారం, కాళ్ల కడియాలు తీసుకొని, ముఖంపై చీర కప్పి తగులబెట్టి పారిపోయాడు.
మంటల్లో కాలిపోయిన గుర్తు తెలియని మహిళ - హత్య కోణంలో దర్యాప్తు
ఈ నెల 15న పోలీసులు వికారాబాద్ శివారులో కాలిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింలు పర్యవేక్షణలో సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఆరు బృందాలను ఏర్పాటుచేశారు. హతురాలి ఫొటోలను సమీప పోలీస్ స్టేషన్లకు పంపారు. ఈ నెల 17న చేవెళ్ల పోలీస్ స్టేషన్లో అనసూయ అదృశ్యంపై ఫిర్యాదు అందింది. అక్కడ ఉన్న ఆమె ఫొటోను చూసి హత్యకు గురైంది అనసూయేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు.
అవుసుపల్లి బాబుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్న విషయం వెల్లడించడంతో చరవాణి సంకేతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 18న తెల్లాపూర్‌లో బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తానే చేసినట్లుగా అంగీకరించాడు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన పోలీసులు మర్డర్‌పై వివరాలను వెల్లడించారు. 2016లో అతనిపై వికారాబాద్ ఠాణాలో ఓ హత్య కేసు నమోదైన విషయం బయటపడింది.
అబ్బాయిలూ కి'లేడీ'లతో జాగ్రత్త - క్యూట్‌గా అడిగిందని లిఫ్ట్ ఇచ్చారో అంతే సంగతులు