ETV Bharat / state

కుమార్తె వెంట పడొద్దన్నందుకు వ్యాపారి దారుణ హత్య - నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన యువకుడు - Vijayawada Kirana Shop Owner Murder - VIJAYAWADA KIRANA SHOP OWNER MURDER

Vijayawada Kirana Shop Owner Murder IN AP : ఏపీలోని విజయవాడలో నడిరోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. కిరాణా షాపు వ్యాపారిపై మణికంఠ అనే యువకుడు దారికాచి కత్తితో దాడి చేశాడు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మణికంఠ వేధించటంతో మందలించినందుకు హత్య చేసినట్టు సమాచారం. నిందితుడు మణికంఠను అరెస్టు చేసిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada Kirana Shop Owner Murder
Vijayawada Kirana Shop Owner Murder (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 2:14 PM IST

Kirana Shop Owner Murder IN AP : ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ బృందావన్‌ కాలనీలో నడిరోడ్డుపై ఓ యువకుడు కిరాణా షాపు వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ (56) బృందావన్‌ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు.

ఆయన కుమార్తె ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తె పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

తన కుమార్తె వెంటపడవద్దని తండ్రి హెచ్చరిక : ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా ఆమె అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్‌ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు.

కత్తితో దారుణ హత్యకు పాల్పడిన యువకుడు : గురువారం శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్‌ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకుమార్తెలు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.

Young Girl's Father Died : రోడ్డుపై పడిన తండ్రిని ఆయన కుమార్తె పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. ఆయన కుమార్తె ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇష్టం లేదన్నా వేధించాడని వ్యాపారి కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

జువెలరీ షాపులోకి చొరబడ్డ ముసుగు దొంగలు - యజమానిని కత్తితో పొడిచి డబ్బుతో పరార్ - JEWELRY SHOWROOM ROBBERY IN MEDCHAL

ప్రేమించలేదని యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది - ఆపై అదే కత్తితో తానూ! - Boyfriend Killed His Girlfriend

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.