ETV Bharat / state

సికింద్రాబాద్‌ టు ముంబయి వందే భారత్‌ స్లీపర్​ ట్రైన్‌ - ఎప్పటి నుంచి అంటే? - Vande Bharat First Sleeper train - VANDE BHARAT FIRST SLEEPER TRAIN

Vande Bharat First Sleeper Coach : వందే భారత్‌ తొలి స్లీపర్‌ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాలైన సికింద్రాబాద్‌ నుంచి ముంబయి నగరాల మధ్య ఈ రైలు తిరిగే అవకాశముంది.

Vande Bharat First Sleeper Train
Vande Bharat First Sleeper Train (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 10:09 AM IST

Updated : Jul 12, 2024, 10:57 AM IST

Vande Bharat First Sleeper Train : వందేభారత్ తొలి స్లీపర్‌ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందు రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా వాటిని ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు సికింద్రాబాద్‌ - ముంబయి నగరాల మధ్య వచ్చే అవకాశముంది.

ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేని కారణంగా తొలి స్లీపర్‌ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ, సికింద్రాబాద్‌ ఎంపీ దక్షిణ మధ్య రైల్వే అరుణ్‌న కుమార్‌కు సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు సికింద్రాబాద్‌-పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో వందేభారత్‌ ట్రైన్‌ (సిట్టింగ్‌) రానున్నట్లు తెలిసింది.

వందే భారత్ రైళ్లకు వస్తున్న ఆదరణ అద్బుతం : దక్షిణ మధ్య రైల్వే జీఎం

వందే భారత్‌ స్లీపర్‌ రైల్లో ఉంటే సదుపాయాలు ఇవే :

  • సులభంగా రైలులోకి ప్రవేశించేందుకు వీలుగా మెట్ల ప్రదేశాన్ని పెంచుతున్నారు.
  • టాయిలెట్లను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నారు. ఎయిర్​ కండీషనింగ్​ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు.
  • సీట్​ కుషన్లను కొత్త టెక్నాలజీతో మారుస్తున్నారు. 99శాతం వైరస్​ను కట్టడి చేసి, ఆక్సిజన్​ లెవల్స్​ సరిగ్గా ఉండేలా చూస్తారు.
  • స్లీపర్​ కోచ్​ ఎలాంటి కుదుపులు, శబ్ధాలు లేకుండా ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

మరోవైపు కాచిగూడ - బెంగళూరు మధ్య 8 భోగీలతో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్‌ డిమాండ్ ఉంది. దాన్ని 16 బోగీలకు పెంచాలన్న డిమాండ్‌నూ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక తుది దశలో ఉన్న చర్లపల్లి టెర్మినల్‌ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ప్రధాన మంత్రి మోదీతో ఈ రైల్వే టెర్మినల్‌ ప్రారంభింపజేయనున్నట్లు తెలిసింది.

విజ్ఞప్తుల ఆధారంగా రైళ్లు : మరోవైపు తిరుపతి నిజామాబాద్‌ల మధ్య సికింద్రాబాద్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌ ప్లాట్‌ఫాం ఖాళీ లేక బోధన్‌ వరకు తీసుకెళ్తున్నారు. ప్రయాణ సమయానికి ముందు బోధన్‌ నుంచి నిజామాబాద్‌కు తీసుకొస్తున్నారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ - రాజ్‌కోట్‌ల మధ్య రాకపోకలు సాగిస్తోంది.

సికింద్రాబాద్​ టు విశాఖపట్నం​ రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ప్రారంభం

PM Modi Vande Bharat : 'దేశంలోని అన్ని ప్రాంతాలకు వందే భారత్​లతో లింక్!.. ఇప్పటి వరకు కోటి మందికిపైగా..'

Last Updated : Jul 12, 2024, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.