ETV Bharat / state

శభాష్​ అనన్య - సివిల్స్​లో సత్తాచాటిన పాలమూరు బిడ్డను అభినందించిన సీఎం రేవంత్​ రెడ్డి - Ananya Reddy Meet CM Revanth Reddy - ANANYA REDDY MEET CM REVANTH REDDY

UPSC 3rd Ranker Ananya Reddy Meet CM Revanth Reddy : ఇటీవల విడుదలైన సివిల్స్​ ఫలితాల్లో మూడో ర్యాంక్​ సాధించిన అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని కలిశారు. సీఎం ఆమెను అభినందించారు. అనంతరం పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. దేశ సేవకు తోడ్పడాలని సీఎం ఆకాంక్షించారు.

UPSC Third Ranker Success Story
Ananya Reddy Meet CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 3:24 PM IST

అనన్య రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి- దేశ సేవకు తోడ్పాడాలని సూచన

UPSC 3rd Ranker Ananya Reddy Meet CM Revanth Reddy : సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన దోనూరి అనన్యరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో తల్లిదండ్రులతో కలిసి అనన్య ముఖ్యమంత్రిని కలిశారు. సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డకు శాలువా కప్పిన సీఎం, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy Congratulations to Civils Third Ranker : జాతీయ స్థాయిలో అత్యుత్తమ కొలువుల్లో సత్తాచాటిన ఆడ బిడ్డ విజయం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. అనన్యను వెనకుండి నడిపించిన తల్లిదండ్రులను రేవంత్‌ రెడ్డి అభినందించారు. విజయవంతంగా తన సివిల్స్​ శిక్షణను పూర్తి చేసి, దేశ సేవకు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అనన్యరెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - UPSC final Results 2023

UPSC Third Ranker Ananya Details : యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ - 2023 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తమ సత్తా చాటారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్​ సాధించారు. ఆమె తొలి ప్రయత్నంలోనే సత్తా చాటారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్న నాటి నుంచే సివిల్స్‌ చదవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివానని వివరించారు. చదివే సమయంలో ఒత్తిడికి గురి కాకుండా క్రికెట్​ చూడటం, నవలలు చదవడం​ చేశానని తెలిపారు. ప్రతికూల సమయాల్లో కూడా రాణించాలంటే ఎలా మెలగాలో విరాట్​ కోహ్లీ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. ఆమెకు సీఎంతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, వ్యక్తులు అభినందనలు తెలిపారని అన్నారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు 1000లోపు ర్యాంకులు సాధించడం విశేషం.

సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ - మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంక్‌ - upsc topper Ananya Reddy Interview

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగుతేజం - తొలి ప్రయత్నంలోనే మూడోర్యాంకుతో ఐఏఎస్ సాధించిన అనన్య - UPSC Third Ranker Ananya Interview

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.