Unknown Person Enters Nizampet Apartments : హైదరాబాద్‌లోని నిజాంపేట ఏరియాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అనుకోకుండా ఓ భవంతిలో రెండో అంతస్థులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపు వేశాడు. ఇంట్లో ఉన్న మహిళ అతన్ని వీడియో తీస్తుండగా, వద్దు నన్ను చంపడానికి వస్తున్నారు? గట్టిగా మాట్లాడకండి అంటూ చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. వీడియో తీసే మహిళ నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నలు సంధిస్తూ వీడియో రికార్డ్ చేస్తుంది.
హైదరాబాద్‌లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లో ఓ అపార్ట్మెంట్లోకి మధ్యాహ్నం పూట ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఉన్న మహిళ వెంటనే వీడియో తీయడం ప్రారంభించింది. నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నలు సంధిస్తుండగా, అతడు భయపడుతూ గట్టిగా మాట్లాడకండి, నన్ను చంపడానికి వస్తున్నారని సమాధానం చెప్పాడు.
90ml బాటిల్ తెస్తేనే నీళ్లలోంచి బయటకొస్తా - హుస్సేన్‌సాగర్‌లో దిగి యువకుడి హల్చల్
Apartment Viral Video in Nizampet : సదరు మహిళ ప్రశ్నలు వేస్తుండగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి, రెండో అంతస్థు నుంచి దూకి పరారయ్యాడు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా బాచుపల్లి పోలీసులు తెలిపారు. అతడు పక్క కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. విషయం తెలుసుకున్న మహిళ, సదరు వ్యక్తిపై ఎలాంటి కేసు వద్దని, విషయాన్ని వదిలి వేయాలంటూ పోలీసులకు తెలిపింది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతారు. కానీ ఆ మహిళ మాత్రం ధైర్యంగా వీడియో తీస్తూ వివరాలు అడిగే ప్రయత్నం చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు నగరంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా? జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, సెల్ఫోన్లో వీడియో తీస్తూ దుండగుడు బయటకు వెళ్లేలా చేసిన సదరు మహిళ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.
మూడు రోజుల శిశువును కిడ్నాప్ చేసిన మహిళ - వీడియో వైరల్
అదరగొట్టేస్సార్రా అబ్బాయిలు - భక్తి పాటకు మాస్ బీట్ వీడియో వైరల్