ETV Bharat / state

తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించిన ప్రజలందరికి ధన్యవాదాలు : కిషన్​రెడ్డి - Salute Telangana bjp Rally - SALUTE TELANGANA BJP RALLY

BJP Salute Telangana Rally : తెలంగాణలో ప్రజలందరూ బీజేపీని 14 శాతం ఓటు బ్యాంకు నుంచి ఒకేసారి 36 శాతానికి పెంచి ఆశీర్వదించారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కమలం విజయానికి సహకరించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఆయన పాదాభివందనాలు తెలిపారు.

UNION MINISTER KISHAN REDDY RALLY
BJP Salute Telangana Rally (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 10:20 PM IST

BJP Salute Telangana Rally : కేంద్రమంత్రిగా నియామకమైన తర్వాత కిషన్ రెడ్డి మొదటిసారి హైదరాబాద్​కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళా మోర్చా నేతలు మంగళ హారతులో స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు "సెల్యూట్‌ తెలంగాణ" పేరుతో బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ ఏపీల్లో ఏ రాష్ట్రం పట్ల మాకు వివక్ష లేదు : కిషన్​ రెడ్డి - kishan reddy about BJP New Government

మండు టెండల్లో సైతం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి 36 శాతం ఓటు బ్యాంకు సాధించినందుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీని ప్రజలు 14శాతం ఓటు బ్యాంకు నుంచి ఒకేసారి 36 శాతానికి పెంచి ఆశీర్వదించారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలిపారు. ఓట్లు, సీట్లు సంఖ్యను పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎనిమిది స్థానాల్లో జయకేతనం.. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్​లో చోటు దక్కించుకున్న కిషన్​ రెడ్డికి బొగ్గు గనులశాఖను కేటాయించగా, బండి సంజయ్​కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు.

కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. విద్యుత్‌ కోతల్లేని దేశాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారన్న కిషన్‌రెడ్డి, బొగ్గు గనుల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

"తెలంగాణలో బీజేపీని ఆశీర్వాదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మండు టెండల్లో సైతం లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి 36శాతం ఓటు బ్యాంకు సాధించేందుకు కృషి చేశారు. తెలంగాణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఓట్లు, సీట్లు సంఖ్యను పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు". - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించిన ప్రజలందరికి ధన్యవాదాలు : కిషన్​రెడ్డి (ETV Bharat)

యువ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు - కిషన్​ రెడ్డి పొలిటికల్​ జర్నీ - Kishan Reddy Oath as a Central Minister

కార్పొరేటర్‌ టు కేంద్రమంత్రి వయా కరీంనగర్ - బండి సంజయ్‌ రాజకీయ ప్రస్థానమిదీ - Bandi Sanjay Political Biography

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.