ETV Bharat / state

సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? : బండి సంజయ్ - Bandi Sanjay on Singareni - BANDI SANJAY ON SINGARENI

Union Minister Bandi Sanjay Question to State Govt : రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం కేంద్రానికి అసాధ్యమని కేంద్రమంత్రి బండి సంజయ్​ స్పష్టం చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Central Minister Bandi Sanjay on Singareni
Central Minister Bandi Sanjay on Singareni (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 10:26 AM IST

Updated : Jun 21, 2024, 10:40 AM IST

Central Minister Bandi Sanjay on Singareni : రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ కుమార్​ సవాల్​ విసిరారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాహకంతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమేనని, రాష్ట్రానిది 51 శాతం వాటా ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈదుస్థితికి రావడానికి కారణం నాటి సీఎం కేసీఆర్​నే అని ఆరోపించారు. తాడిచర్లలో ఏపీ జెన్​కో ఇస్తే కేసీఆర్​ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అప్పగించింది నిజం కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

సింగరేణిని ప్రైవేటీకరించింది కేసీఆర్​నే : సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆర్​. ఆయన మూర్ఖత్వపు ఆలోచనల వల్ల సింగరేణిని పూర్తిగా దెబ్బతీశారని కేంద్రమంత్రి బండి సంజయ్​ దుయ్యబట్టారు. తన కుటుంబానికి ఏటీఎంలా మార్చుకున్నారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్​ కూడా కేసీఆర్​ కుటుంబం మాదిరి అదే బాటలో నడుస్తోందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్​కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణి కార్మికుల పట్ల ప్రేమ ఉంటే గతంలో కేసీఆర్​ చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్​ సర్కార్​ గతంలో నయీం కేసు, మియాపూర్​ భూములు, డ్రగ్స్​, పేపర్​ లీకేజీ వంటి వాటిపై సిట్​ వేసి మధ్యలోనే నీరు గార్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ కూడా అంతే ఫోన్​ ట్యాపింగ్​, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వేరే ఆలోచనలే లేదని ఆరోపించారు.

"సింగరేణి విషయంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి, కార్మికులలోకి తీసుకెళ్లి అయోమయం సృష్టించే పని చేస్తున్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయలేదు. కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం. సింగరేణిలో జరిగే అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా?." - బండి సంజయ్​, కేంద్రమంత్రి

మెదక్ అల్లర్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా- పోలీసులకు కీలక ఆదేశాలు - Union Minister Bandi Sanjay

విద్యుత్​ కొనుగోళ్లపై నియమించిన ఛైర్మన్‌ను వైదొలగాలని కేసీఆర్ బెదిరించడం ముమ్మాటికీ ధిక్కరణే: బండి సంజయ్‌ - bandi sanjay fires on kcr

Last Updated : Jun 21, 2024, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.