Unemployed Protest in Chikkadapally Central Library : హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్- 2, గ్రూప్- 3 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగర కేంద్ర గ్రంథాలయానికి చేరుకున్నారు. లైబ్రరీ నుంచి శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసులు మధ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరు దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు, పరీక్షలు వాయిదా వేసే వరకూ పోరాటం ఆగదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
"మేమైనా తీవ్రవాదులమా, అసలు లైబ్రరీకి పోలీసులు రావాల్సిన అవసరం ఏమున్నది? గ్రూప్ 2 పోస్టులు పెంచి, పరీక్షను వాయిదా వేయాలని అడుగుతున్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి చాలు. శాంతియుతంగా మా నిరసన తెలియజేయాలని చెప్పి ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే, చాలా దారుణంగా మమ్మల్ని పోలీసులు వ్యాన్లలో ఎక్కించి ఇలా నిర్బందిస్తున్నారు."-నిరుద్యోగులు
Harish Rao Respond on Group 2 Aspirants Strike : చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు.
నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం : ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నాడు సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకు వెళ్లి ఓట్లు కొల్లగొట్టారు, నేడు పోలీసులను పంపించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని మాజీమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థులు, అభ్యర్థులతో ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 15, 2024
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం.
ఇదేనా ప్రజా పాలన అంటే,
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
👉నాడు సిటీ సెంట్రల్… pic.twitter.com/93tJ5SeB91
పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ డీఎస్సీ అభ్యర్థుల ర్యాలీ - Dsc Candidates Protest
గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా - Unemployed Protest on Group 2 Exams