ETV Bharat / state

హైదరాబాద్​లో అండర్ ​గ్రౌండ్ మెట్రో - ఎయిర్​పోర్టు కారిడార్‌లో తొలిసారి ప్రయోగం - Underground Metro in Hyderabad

Underground Metro In Hyderabad : పట్టణ ప్రజా రవాణాలో విప్లవాత్మక సంచలనం మెట్రో రైలు వ్యవస్థ. దేశంలో పెరుగుతున్న మానవాళిని దృష్టిలో పెట్టుకొని, దానికి అనుగుణంగా నగరాల్లో మెట్రో కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్​ మెట్రో సైతం పలు ప్రత్యేకతల సమాహారంగా మారుతోంది. నిన్నటి వరకు నేలపై నడిచిన రైల్​, నేడు ఆకాశంలో విహరిస్తుంటే ఔరా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా భూగర్భంలోనూ రైలు పరుగు పెట్టనుంది. మరి ఈ అండర్​గ్రౌండ్ మెట్రో విశేషాలు తెలుసుకుందామా?

Hyderabad Metro Specialities
Underground Metro in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 9:26 AM IST

Underground Metro In Airport Corridor Hyderabad : శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​ వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం, పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. ఇప్పటివరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ(ఎలివేటెడ్‌) మార్గాలే. ఎయిర్​పోర్టు కారిడార్‌లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమిపై కొంత, భూగర్భంలో మరికొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లో పొందుపర్చారు.

నాగోల్‌ నుంచి 33.1 కి.మీ. విస్తరణ : రాయదుర్గం నుంచి నాగోల్‌ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. మేరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు. ఇందులో నాగోల్‌ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కి.మీ. ఎలివేటెడ్​ ( ఆకాశమార్గం) ఉంటుంది. లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్​పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ. ఎట్‌ గ్రేడ్‌ (భూమార్గాన్ని) ప్రతిపాదించారు.

ఇక్కడ రహదారిపై డివైడర్‌ స్థలం చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సూచించారు. బేసిక్​ స్టడీ చేశాక స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. విమానాశ్రయ ప్రాంగణ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు - కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలనీ ప్రతిపాదించారు.

కిలోమీటరున్నరకో మెట్రో స్టేషన్‌ : నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్​పోర్టు వరకు సగటున కిలోమీటరున్నర దూరానికి ఒకటి చొప్పున మొత్తం 22 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి. వీటిలో కొన్నింటిని ‘ఫ్యూచర్‌ స్టేషన్లు’గా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతిపాదించారు. నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి వంటి ప్రాంతాల్లో ఇంటర్‌-ఛేంజ్‌ స్టేషన్లు రాబోతున్నాయి. ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్‌లో అవసరమైతే మార్పులు చేర్పులు సైతం చేస్తారు.

Land Acquisition Notification Issuance : ప్రాథమిక డీపీఆర్‌ ప్రకారం విమానాశ్రయ మార్గంలో సేకరించాల్సిన భూముల్ని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఇప్పటికే గుర్తించింది. గత అనుభవాల దృష్ట్యా డీపీఆర్‌కు సెంట్రల్, స్టేట్​ గవర్నమెంట్స్​ ఆమోదం తెలిపి, టెండర్లు పిలిచేనాటికి ఆస్తుల సేకరణ పూర్తి చేసేలా హెచ్‌ఏఎంల్‌ ముందడుగు వేస్తోంది. ఆస్తుల సేకరణకు సంబంధించి 2013 కేంద్ర భూసేకరణ యాక్ట్​ ప్రకారం ఈ నెల 3న హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్లు జారీ చేశారు. అబ్జెక్షన్​ తెలిపేందుకు 60 రోజుల గడువు ఇచ్చారు. ఆస్తుల గుర్తింపును బట్టి ఎప్పటికప్పుడు ఈ తరహా ప్రకటనలను మెట్రో జారీ చేయనుంది.

రూ.24 వేల 42 కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ - మరో 8 కి.మీ పొడిగింపు - Hyd Metro Phase Two Update

ముందు రైలు ఎక్కండి దిగాకే టికెట్ కొనండి - మెట్రోలో ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌! - OPEN LOOP TICKETING IN HYD METRO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.