ETV Bharat / state

గణతంత్ర వేడుకల్లో విషాదం - విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి - mulugu district latest crime news

Two Youngmen Died due to Electric Shock : ములుగు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రిపబ్లిక్​ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్​ షాక్​కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. గాయాల పాలైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబసభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు.

Two Youngmen Died due to Electric Shock in mulugu
Two Youngmen Died due to Electric Shock
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 12:57 PM IST

Two Youngmen Died due to Electric Shock : గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ములుగు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. గద్దెపై ఐరన్​ పోల్​ను నాటుతుండగా అది కాస్తా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు తాకడంతో ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్​తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విజయ్, అంజిత్​లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ ఇద్దరికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. స్వల్ప గాయాలైన చక్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రిపబ్లిక్​ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హాస్పిటల్​కు చేరుకొని మృతి చెందిన విజయ్, అంజిత్​ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా ఇద్దరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఊళ్లల్లో కానీ, పొలాల్లో కానీ ఎక్కడైనా విద్యుత్​ వైర్లు ప్రమాదకర స్థితిలో ఉంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కరెంట్​ షాక్​ తగిలి ఏనుగు మృతి.. లైవ్​ వీడియో వైరల్​!

"గణతంత్ర వేడుకల వేళ ఇలా జరగడం దురదృష్టకరం. జెండాను ఎగురవేసేందుకు యువకులు ఏర్పాట్లు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్​ వైర్లు జెండా పోల్​కు తగలడంతో ముగ్గురు యువకులు ఒక్కసారిగా కరెంట్​ షాక్​కు గురయ్యారు. అక్కడే ఉన్న వారిని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినా, తీవ్రంగా గాయపడటం వల్ల ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబసభ్యులకు తక్షణ సాయంగా చెరో రూ.10 వేలు అందించా. మరో రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా అందేలా చూస్తాను." - మంత్రి సీతక్క

గణతంత్ర వేడుకల్లో విషాదం - విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

గడ్డితో విద్యుత్ తీగను కోసిన రైతు.. అక్కడికక్కడే మృతి

ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి.. కరెంట్ షాక్​తో మృతి.. అక్క పుట్టిన రోజునే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.