Two Hyderabad Pilgrims killed in Landslides in Uttarakhand : దేవ భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో జరిగిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులైన నిర్మల్ షాహీ (36), సత్య నారాయణ (50) బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై వస్తుండగా మార్గమధ్యంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
హిమాచల్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి రాకపోకలు బంద్.. లోయలో బస్సు బోల్తా..
రెండు రోజులు భారీ వర్ష సూచన : భారీ వర్షాల కారణంగా ఉత్తరఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అటు కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ నేషనల్ హైవే కొన్ని చోట్ల ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిపివేశారు. రుద్రప్రయాగ్ - కేదార్నాథ్ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు. శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాకు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు చర్యగా రుద్రప్రయాగ్‌లోని అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇవైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కశ్మీర్లో భారీగా హిమపాతం.. విరిగిపడిన కొండ చరియలు.. రవాణా సేవలకు తీవ్ర ఆటంకం