Two Fake Excise Cops Arrested : ఓ ఇద్దరు వ్యక్తులు నకిలీ పోలీసుల అవతారమెత్తారు. రహదారిపై వెళ్తున్న వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడి ఓ వ్యక్తి వద్దనుంచి డబ్బులను దోచేశారు. బాధితుడు ఇచ్చిన సమాచారంపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని నకీలీ అబ్కారీ పోలీసులుగా తేల్చారు. వారిద్దరినీ న్యాయస్థానంలో హాజరు పరిచారు.
ఇదీ జరిగింది : బాధితుడు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు అబ్కారీ శాఖ పోలీసులమంటూ రహదారిపై వెళ్తున్న వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడి నగదు కాజేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంటలో చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన ఇస్మాయిల్ వ్యక్తిగత పనుల కోసం ద్విచక్రవాహనంపై కోదాడకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. దొరకుంట వద్దకు రాగానే ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇస్మాయిల్‌ను నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన బెల్లంకొండ వినయ్, కోదాడకు చెందిన మతిన్లు అడ్డగించారు.
తాము ఆబ్కారీ శాఖ పోలీసులమని, తనిఖీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్దిసేపు హడావిడి చేసి గంజాయి తాగినట్లు బాధితుడిపై అభియోగం మోపారు. అతని నుంచి రూ. 4500 నగదు, సెల్‌ఫోన్ లాగేసుకుని పరారయ్యారు. వీరి ప్రవర్తన పట్ల అనుమానంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించి నకిలీ పోలీసులుగా తేల్చారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరికి గతంలో గంజాయి కేసులో ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో ఇంటిదొంగల గుట్టురట్టు - సీఐడీకి చిక్కిన మరో ముగ్గురు పోలీసులుFake Woman
Fake RPF SI Arrested in Narketpally : కొద్ది రోజుల క్రితం నార్కట్‌పల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి ఎలాగైనా తన గ్రామంలో పేరు తెచ్చుకోవాలని పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో చలామణి కావాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫామ్ కొనుగోలు చేసి, నకిలీ ఐడీ కార్డును తయారుచేసుకుని రైల్వే పోలీసుల అవతారమెత్తింది. తనకు రైల్వేలో ఎస్సైగా ఉద్యోగం వచ్చిందని తల్లి దండ్రులను, గ్రామస్థులను నమ్మించి ఏడాది కాలంపాటు శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్లి వస్తున్నట్లు నటించింది. ఎక్కడికి వెళ్లినా యూనిఫాంలోనే వెళ్తూ ప్రముఖులతో ఫొటోలు దిగూతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేది. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కైంది.
కొంపముంచిన పెళ్లిచూపులు - అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై
Police Arrest in Hyderabad : ఫేక్ పోలీస్ అవతారం ఎత్తి.. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం