ETV Bharat / state

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు - నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు - Road Accident in Nalgonda

Road Accident in Nalgonda : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఇందులో రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా వెళ్తున్న డీసీఎం ఢీకొట్టిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. షాద్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ప్రమాదంలో బస్సు వేగంగా లారీని వెనక నుంచి ఢీకొన్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.

ROAD ACCIDENT IN SADASIVAPET
Road Accident in Nalgonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 10:48 AM IST

Road Accident in Nalgonda : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేబుల్ వైర్లు తెగిపోవడంతో, టాటా కంపెనీకి చెందిన కార్మికులు రాత్రి నుంచి దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద కేబుల్ వైర్లకు మరమ్మతులు చేస్తున్నారు. తెల్లవారుజామున వారికి సంబంధించిన బోలెరో వాహనాన్ని రోడ్డు పక్కన పెట్టుకుని పనులు చేస్తున్నారు.

ఈ క్రమంలో గుంటూరు వైపు వెళ్లే డీసీఎం వాహనం అతి వేగంగా, రోడ్డు పక్కన ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. వేగంగా పల్టీ కొట్టి పని చేస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే పని చేస్తున్న యస్వీ (22), రిజ్వాన్ (36) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం : కర్ణాటక బస్సు వేగంగా లారీని వెనక నుంచి ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కర్ణాటక బస్సు సదాశివపేట మండలం మద్దికుంట వద్ద లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాను. ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది. గాయాలు అయిన వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

షాద్‌నగర్‌ వద్ద యాక్సిడెంట్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని ఎలికట్ట చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైక్ వేగంగా ఢీకొనడంతో, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆయిల్ ట్యాంకర్​, ట్రక్కు ఢీ - మంటల్లో చిక్కుకుని 48 మంది స్పాట్ డెడ్

గ్యాస్​ లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా - రోడ్డుపై పడిపోయిన వందల సిలిండర్లు - కొద్దిలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.