Two Old Couple Died in One Day at Anantapur District : పెళ్లైన నాటి నుంచి ఒకరికొకరు తొడుగా ఉంటూ దశబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు ఓ వృద్ధ జంట. సొంతవారు ఉన్న ఎవ్వరిపైన ఆధారపడకుండా రెక్కల కష్టంతోనే బతుకు బండిని లాగుతున్నారు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవతంలోకి మృత్యువు వచ్చి పలకరించింది. ప్రమాదశవత్తు కట్టుకున్న భార్య కళ్లముందే చనిపోతే ఆ బాధను భరించలేక 24 గంటలు గడవక ముందే మృత్యువులోనూ భార్యకు తోడుగా వెళ్లాడు భర్త. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం రోజునే అమ్మ, నాన్న మృతి చెందాడంతో వారి పిల్లలు గుండెలు పగిలెలా రోదించారు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
వర్షానికి మట్టిమిద్దె కూలి దంపతులు మృతి- అనంతపురం జిల్లాలో విషాదం - Couple Died
అనుకోని ప్రమాదం : కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఎస్ఎల్ఎన్ కాలనీలో బాలం రామకృష్ణ (65), లక్ష్మీ దేవి (60) జీవనం సాగించేవారు. బతుకు తెరువకోసం గత రెండేళ్లుగా గుంతకల్లు మండలం కసాపురం పరిసర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్ద కాపలాదారులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోకుండా మూడు రోజుల క్రితం లక్ష్మీదేవి కంటికి పేడ పురుగు కాటేసింది. దీంతో ఆమె కళ్లకు భారీగా వాపు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంభ్యులకు తెలిపాడు బాలం రామకృష్ట. విషయం తెలుసుకున్న కుమారుడు కసాపురం చేరుకునేలోపే లక్ష్మీదేవి మృతి చెందింది.
మృత్యువులోనూ వీడని బంధం : కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఉరవకొండకు తీసుకువచ్చి సాంప్రదాయం ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం ఖననం చేశారు. అయితే మృతదేహానికి శ్మశానంలో అంతక్రియలు నిర్వహిస్తుండగా భార్య మరణించిన బెంగతో రామకృష్ణ ఇంటి వద్దనే ఉన్నాడు. తన భార్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయాడు. చివరికి ఆ బాధను భరించలేక ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అంతక్రియలు నిర్వహిస్తున్న కుటుంభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా రామకృష్ణ అప్పటికే మృతి చెందాడు. ఇదివరకే తల్లిని కోల్పోయిన కుటుంబసభ్యులు 24 గంటలు గడవక ముందే తండ్రిని కోల్పోవడంతో వారి పిల్లలు బోరున విలపించారు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం రోజునే అమ్మ,నాన్న మృతి చెందాడంతో వారు గుండెలు పగిలెలా రోదించారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. వీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. 24 గంటలు గడవక ముందే ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు నెలకొన్నాయి.
డబ్బు ఇవ్వలేదని నిప్పంటించుకున్న భర్త, ఆర్పేందుకు ప్రయత్నించిన భార్య, ఇద్దరు మృతి
3రోజులుగా కుళ్లిన మృతదేహాల మధ్య నవజాత శిశువు.. తల్లిపాలు లేకున్నా ఆరోగ్యంగానే..