ETV Bharat / state

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్స్ - ఒకే రోజు 164 కేజీల సరకు పట్టివేత - Interstate Ganja Gang Arrested - INTERSTATE GANJA GANG ARRESTED

Interstate Drug Gang Busted In Hyderabad : రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణా పైన నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.64 లక్షల విలువైన 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Interstate Drug Gang Busted In Hyderabad
Interstate Drug Peddlers Gang Arrested in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 8:03 AM IST

Interstate Drug Peddlers Gang Arrested in Hyderabad : నగరంలో చాప కింద నీరులా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో సరిహద్దుల్లో పోలీసులు నిఘాా ఉంచారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా రాచకొండ పోలిస్ కమిషనరేట్‌ ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్‌కు గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు.

అందులో రవి, సయ్యద్, ఆనంద్ రామ్జీ నుంచి 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని హుమాయ్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తే, అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మరో కేసులో భవానీనగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో 64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు షేక్‌ పర్వేజ్ పైనా ఉమ్మడి రాష్ట్రంలో మూడు ఎన్డీపీఎస్‌ కేసులో నమోదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లంగర్ హౌజ్ ఎన్డీపీఎస్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత గంజాయి రవాణా చేశాడని పోలీసుల విచారణలో తేలింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడిన గంజాయి - ఐదుగురు అరెస్టు

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్స్ ఒకేరోడు 164 కేజీల సరకు పట్టివేత (ETV Bharat)

"100 కేజీల గంజాయి తరలిస్తున్న ముగ్గురు దొరికారు. ఇందులో ప్రధానమైన వాడు ధరావత్ రవి. ఇతనిపై ఇదివరకే మూడు కేసులు ఉన్నాయి. ఒడిశాలో గంజాయి సాగు చేస్తున్న గోవింద్ అనే వ్యక్తి నుంచి వీటిని తీసుకొస్తున్నారు. మాకు వచ్చిన సమాచారంతో మేము నిందితులను పట్టుకున్నాం. షేక్​ పర్వేజ్ అనే వ్యక్తి ఇలాంటి కేసులో జైలుకి వెళ్లినప్పుడు అక్కడ డ్రగ్స్ సప్లై చేసే దీపక్​ అనే వ్యక్తితో పరిచయం కుదిరింది. అప్పులు తీర్చడానికి దీపక్​తో కలిసి గంజాయి సప్లై చేస్తుంటే పట్టుకున్నాం." - రేష్మి పెరుమాళ్‌, డీసీపీ, టాస్క్ ఫోర్స్

ఆరుగురు అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యుల పైనా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నారు. గంజాయి సేవిస్తున్న విక్రయిస్తున్న వారిపైన నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు. గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్న ప్రజలు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

శంషాబాద్​లో గంజాయి చాక్లెట్లు - స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

2043 కిలోల గంజాయిని తగులబెట్టిన నల్గొండ పోలీసులు - విలువ ఎంతో తెలిస్తే షాక్! - NALGONDA POLICE BURNT 2043 KG GANJA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.