ETV Bharat / state

కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం - ఫ్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుని జబర్దస్త్​ నటుడి మృతి - Jabardasth Actor DIED in ACCIDENT - JABARDASTH ACTOR DIED IN ACCIDENT

TV Artist Died Train Accident at Bhadradri Kothagudem : కదులుతున్న రైలును ఎక్కే క్రమంలో జబర్దస్త్​ నటుడు​ పట్టుతప్పి పడిపోయాడు. రైలు, ప్లాట్​ఫాం మధ్యలో ఇరుక్కుపోయాడు. విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు రైలును ఆపి, వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది.

TV Artist Died Train Accident at Bhadradri Kothagudem
TV Artist Died Train Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 1:13 PM IST

TV Artist Died Train Accident at Bhadradri Kothagudem : రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులు చెబుతున్నా, కొంత మంది వ్యక్తులు పట్టించుకోవడం లేదు. రైలు వెళ్లిపోతుందనే తొందరలో ఏం ఆలోచించకుండా ఎక్కేందుకు సాహసం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో. తాజాగా ఓ టీవీ ఆర్టిస్ట్ (జబర్దస్త్​ నటుడు)​ కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం గమనించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ (53) భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్​కు శుక్రవారం ఉదయాన్నే వచ్చారు. ఆ సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కాలు జారి కిందకి పడిపోవడంతో రైలు, ప్లాట్​ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన రైలులోని ప్రయాణికులు చైన్ లాగారు. దీంతో లోకోపైలెట్​ రైలును ఆపారు.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య - Serial Actor Chandu Suicide

TV Artist Mohammedin Died : ఫ్లాట్​ ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన నటుడిని ప్రయాణీకులు, సిబ్బంది సాయంతో రైల్వే పోలీసులు బయటకు తీశారు. అనంతరం 108లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నడుము, పక్కటెముకలకు తీవ్ర గాయలయ్యాయని గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించారు. వైద్యం కోసం కుటుంబసభ్యులు ఖమ్మం తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రిలో భద్రపరిచారు. వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు : మేదర మహ్మద్దీన్‌ టీవీ ఆర్టిస్ట్​గా పేరుపొందారు. ఈటీవీ జబర్దస్త్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. షూటింగ్‌ ఉందని హైదరాబాద్‌కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్​కు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ, పదో తరగతి చదివే ఇద్దరు కుమార్తెలున్నారు. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది. కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

Actress Renjusha Menon Died : ప్రముఖ​ నటి అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.