TTD E Auction the Clothes and Rice: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. నవంబర్ నెలలో వస్త్రాల ఈ వేలానికి సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సాధారణంగా తిరుమల వచ్చే భక్తులు.. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో.. తలనీలాలు సమర్పిస్తుంటారు. అలాగే ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, డబ్బులు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచీలు, దుస్తులు, బియ్యం.. ఇలా ఎన్నో రకాల వస్తువులను హుండీలో వేస్తుంటారు. అయితే వాటిలో దుస్తులు, బియ్యాన్ని టీటీడీ ఈ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వస్త్రాల ఈ వేలం అప్పుడే: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను నవంబరు 4 నుంచి 11వ తేదీ వరకు ఈ వేలం (ఆన్లైన్) వేయనున్నారు. ఇప్పటికే ఈ వేలం మొదలుకాగా.. నవంబర్ 11 లాస్ట్ డేట్. ఇక భక్తులు సమర్పించిన వస్త్రాలలో.. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నాయి. అందులో ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్‌పీస్‌లు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు.. ఇలా చాలా రకాలు ఉన్నాయి.
ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనేందుకు, ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. లేదంటే 0877-2264429 నంబర్‌కు ఫోన్ చేసి, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించివచ్చని టీటీడీ అధికారులు సూచించారు.
బియ్యం టెండర్ అప్పుడే: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యాన్ని నవంబర్ 7వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,880 కేజీలు టెండర్ కమ్ వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబర్ 7వ తేదీలోపు "కార్యనిర్వహణాధికారి, టీటీడీ" పేరిట రూ. 25వేలు - ఈఎండి, సీల్డ్ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో వివరించారు. ఇక అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను ప్రకటిస్తారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించాలని తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - ఇక వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్
శ్రీవారి సేవకు "కోటి రూపాయల" టికెట్ - జీవితాంతం స్వామి సేవలో! - ప్రత్యేకతలు తెలుసా?
అప్పట్లో 'వడ' ఆ తర్వాత 'బూందీ' ఇప్పుడు 'లడ్డూ' - తిరుమల శ్రీవారి 'ప్రసాదం కథ' తెలుసా?