ETV Bharat / state

గృహజ్యోతి పథకంపై ప్రభుత్వం కసరత్తు - అర్హుల వివరాల సేకరణలో విద్యుత్​ పంపిణీ సంస్థలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 5:31 PM IST

TSSPDCL Work On Gruha Jyothi Date Collection : రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు రేవంత్​రెడ్డి సర్కార్​ సిద్ధమవుతోంది. గృహజ్యోతి పథకం అమలుకు అర్హల వివరాలను సేకరించడానికి విద్యుత్ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ​

200 Units Free Power Scheme
TSSPDCL Work On Gruha Jyothi Date Collection

TSSPDCL Work On Gruha Jyothi Date Collection : రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మరో రెండు గ్యారంటీలు కార్యరూపం దాల్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. గృహజ్యోతి ఉచిత విద్యుత్​(Free Power) అమలుపై విద్యుత్​ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రత్యేక దృష్టి సారించాయి.

ఎస్పీడీసీఎల్​ సీఎండీ ముషరాఫ్​ ఫారూఖీతో పాటు అధికారులు సైతం క్షేత్రస్థాయిలో సిబ్బంది నమోదు ప్రక్రియ పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన సలహాలు సూచనలు క్షేత్రస్థాయిలోనే తెలియజేస్తున్నారు. ఏవైనా సందేహాలు వచ్చినా వాటిని క్షుణ్నంగా తీరుస్తున్నారు. అర్హుల నమోదు ప్రక్రియ ఎలా సాగుతుందో అధికారులు స్వయంగా పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా గృహజ్యోతి అర్హుల వివరాలను నమోదు చేయాలని ఎస్పీడీసీఎల్​ సీఎండీ ముషరాఫ్​ ఫారూఖీ అధికారులకు ఆదేశించారు.

అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ

200 Units Free Power Scheme : ఎస్పీడీసీఎల్​ పరిధిలోని అర్హుల నమెదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అమలు కోసం మీటర్​ రీడర్లు ఇంటింటికి తిరిగి అర్హుల వివరాలు నమోదు చేస్తున్నారు. రేషన్​కార్డు, ఆధార్​, సెల్​ఫోన్​ నంబరు అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో గృహజ్యోతి(Gruhajyothi) కింద ఉచిత విద్యుత్​ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగంగా అర్హుల వివరాలను వీలైనంత త్వరగా నమోదు చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. అర్హుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయడానికి విద్యుత్ సంస్థలు ప్రస్తుతం డీఎస్పీడీసీఎల్​లో ఉన్న సాఫ్ట్​వేర్​ను అధికారులు అప్​డేట్​ చేశారు. అందులో భాగంగా మీటర్​ రీడర్లు అర్హులైన వారి రేషన్​కార్డు నంబరు, ఆధార్​ కార్డు నంబరు, ఫోన్​నంబర్​ను అనుసంధానం చేసే విధంగా సాఫ్ట్​వేర్​లో మార్పులు చేశారు. దీంతో అర్హులకు అవసరమైన అదనపు డేటాను అనుసంధానం చేయడం సులభం అవుతుంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రజలకు మరో రెండు గ్యారంటీలు - అమలుకు సర్కార్ తీవ్ర కసరత్తు

CM Revanth Reddy On Gruhajyothi Scheme : లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలక్షన్​ కోడ్​ రాకముందుకే మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకూ వైద్యసేవల హామీలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ.3,000ల కోట్లు అవసరమని అంచనా వేసింది. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీల అమలును త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే ప్రకటించారు. ఆ రెండు పథకాలను కేబినెట్ సమావేశంలో ఆమోదించారు.

కొలిక్కి వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ - క్షేత్రస్థాయి పరిశీలనకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.