ETV Bharat / state

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses To Medaram Jatara 2024 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

Medaram Jathara In Mulugu
TSRTC Special Buses In Medaram Jatara 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 9:04 AM IST

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses To Medaram Jatara 2024 : ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగనుంది. మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్‌ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జాతరకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూం, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బస్సులు మార్గ మధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

Medaram Jatara 2024 : రెండేళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతరకు పది రోజుల ముందే అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్

''మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జాతరకు కూడా మహిళలకు ఫ్రీ ప్రయాణమే ఉంటుంది. " - సజ్జనార్, టీఎస్​ఆర్టీసీ ఎండీ

Medaram Jatara Special Buses 2024 : మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

సాధారణంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మేడారం సమక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సిద్ధం

మినీ మేడారం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర - ఈ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.