ETV Bharat / state

తెలంగాణ జెన్​కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా - త్వరలోనే కొత్త తేదీల ప్రకటన - Telangana Genco Exam Postponed

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 7:25 PM IST

Updated : Mar 28, 2024, 7:34 PM IST

TS Genco Exam Postponed : ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న కారణంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. తాజాాగా ఈ నెల 31న జరగాల్సిన తెలంగాణ జెన్​కో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

TS Genco Exam
TS Genco Exam Postponed

TS Genco Exam Postponed : ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 31న జరగాల్సిన తెలంగాణ జెన్​కో సంస్థ ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేసినట్లు ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 4వ తేదీన ఏఈ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి లోక్​సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏఈ పరీక్ష నిర్వహించలేకపోతున్నామని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అభ్యర్థులు పరిగణలోకి తీసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.

టీఎస్ లాసెట్, ఈసెట్2024 షెడ్యూల్​ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే

Election Code Implementation in Telangana : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఈఏపీ సెట్, ఐసెట్ తేదీలను మారుస్తూ ఉన్నత విద్యా మండలి ఇటీవల నూతన షెడ్యూల్ విడుదల చేసింది. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీ సెట్​ను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు 7, 8 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు 9 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. జూన్ 4, 5 తేదీల్లో జరగనున్న ఐసెట్ పరీక్షలు, జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనుంది. మే 13 నుంచి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

TG Polycet Exam Postponed : రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ (టీఎస్​ పాలిసెట్‌) వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 20న విద్యా శాఖ తెలిపింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. మే 17న పాలిసెట్‌ పరీక్ష జరగాల్సి ఉండగా, మే 24న (Polycet Exam New Dates) నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈఏపీ​సెట్ షెడ్యూలు విడుదల - ఈనెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి నెలలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ (Polycet Notification) వెలువడింది తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 24 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వివరించారు.

టీఎస్ ఈఏపీసెట్​గా మారిన ఎంసెట్, మే 9 నుంచి ప్రవేశపరీక్షలు

Last Updated : Mar 28, 2024, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.