Tragedy in Holi Celebrations at Narayanpet District : హోలీ పండుగ కావడంతో ఆ చిన్నారి అప్పటి వరకూ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతోంది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రంగు బాటిల్స్‌లో నీటిని నింపుకునేందుకు ఆ బాలిక తన మిత్రులతో కలిసి వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
హోలీ వేడుకల్లో అపశృతి.. చెరువులో గల్లంతై వ్యక్తి మృతి
Child Died Water Tank Collapse Incident : నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్పేట వీధిలో లక్ష్మి ప్రణతి అనే బాలిక 7వ తరగతి చదువుతుంది. ఈరోజు హోలీ (Holi Celebrations 2024) కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ఆడుకుంటుంది. ఇంతలో రంగు బాటిల్స్‌లో నీరు నింపుకునేందుకు స్నేహితులతో కలిసి వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలడం ఆ శిథిలాలు వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో లక్ష్మి ప్రణతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Holi Celebrations in Telangana : అక్కడి నుంచి బాధితులను మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకూ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హోలీ సంబురాల్లో విషాదం.. చెరువులు, కుంటల్లో స్నానాలకు వెళ్లి 12 మంది మృతి