Traditional Dress Implementation Delayed in Yadadri Temple : తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జూన్ 1 అనగా నేటి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలో పాల్గొనేందుకు అనుమతిస్తామని గతంలో యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించిన విషయం విదితమే. దీంతో పాటు పాటు కొండపైన పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని తెలిపారు. ఈ నిబంధనల అమల్లో కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
జూన్ 2న యాదాద్రిలో నిబంధనలపై అవగాహన ర్యాలీ : ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించడం, ప్లాస్టిక్‌కు బదులు ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై అటు భక్తులకు, ఇటు వ్యాపారులకు మరింత అవగాహన కల్పించడం అవసరమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. జూన్ 2వ తేదీన అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, నాయీబ్రాహ్మణులతో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా కొండపైన అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి.
Hanuman Jayanti Celebrations In Yadadri : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, ఆంజనేయ స్వామి వారికి మన్య సూక్త పారాయణముతో పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు చేశారు.
వేదమంత్రాలతో పూజలు నిర్వహించిన అర్చకులు : అనంతరం, లక్ష నాగవల్లి దళ పత్రములతో క్షేత్రపాలకునికి సహస్రనామార్చన పూజలు జరిపారు. పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి ఆలయం పాతగట్ట నందు కూడా యథావిధిగా ఉత్సవాల నిర్వహణ చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
యాదాద్రిలో వైభవంగా మొదలైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు - Yadadri Jayanthi Utsavalu 2024
భక్త జనసంద్రమైన యాదాద్రి ఆలయం - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple