Tractor Overturned in Adilabad District : శివరాత్రి సందర్భంగా దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన వారందరికి, ఊహించని ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదఘటనలో ఉన్న స్థానికుల వివరాల ప్రకారం, ఆదిలాాబాద్(Adilabad) మండలం ఖండాలకు చెందిన గ్రామస్థులు మహాశివరాత్రి సందర్భంగా సిరికొండ దైవదర్శనానికి వెళ్లారు.
శివరాత్రి రోజు దర్శనం పూర్తిచేసుకుని, ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఇంద్రవెళ్లి(Indravelly) మండలం పోతుగూడకు చేరుకోగానే ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.