ETV Bharat / state

కాసులు కురిపిస్తున్న టమాటా - అప్పులు తీరిపోతాయని అన్నదాతల ఆనందం

టమాటా రైతులకు మంచి గిట్టుబాటు - ఆనందం వ్యక్తం చేస్తున్న కర్నూలు జిల్లా రైతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Tomato Prices Increase
Tomato Prices Increase (ETV Bharat)

Tomato Prices Increase : కళతప్పిన పొలాలు కాసులు కురిపిస్తున్నాయి. దిగుబడులు పోటీపడి దిగొస్తున్నాయి. కుదేలైన కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంట్లో తిష్టవేసిన కష్టాలు గడపదాటుతున్నాయి. చుట్టూ పేరుకుపోయిన అప్పులు తీరిపోతున్నాయి. ఊహించని ధరలు ఆహ్వానిస్తున్నాయి. లాభాలతో జేబులు నిండుతున్నాయి. వర్షాల తర్వాత కోలుకున్న పంటలు రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. దిగుబడులు మెండుగా ఉన్నాయి. లాభాలు మెరుగయ్యాయి. రైతుల మోములు ఆనందంతో కళకళలాడుతున్నాయి.

అన్నదాతలకు లాభాలు : కర్నూలు జిల్లాలో గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. తర్వాత కోలుకున్న పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దిగుబడులు మెండుగా వస్తుండటం, ధరలు సైతం అధికంగా ఉండటంతో అన్నదాతలకు లాభాలు దరిచేరుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కిలో ధర రూ.200 లకు చేరినా ఆశ్చర్యం లేదని, ప్రస్తుతం హోల్‌సేల్‌గా మార్కెట్లో రూ.50 నుంచి రూ.60లకు ధర లభిస్తోందని చెబుతున్నారు. రిటెయిల్‌ మార్కెట్‌లో కిలో టమాటా రూ.100కు పైగా పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోతలు, రవాణా తదితర ఖర్చులు పోను బాగానే మిగులుబాటు అవుతోందని, ఇది ఇలాగే కొనసాగితే మరింత ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాగు తగ్గింది కానీ ధర అదిరింది - టమోటా రైతుల్లో ఆనందం - Tomato Farmers Happy prices

తెలంగాణ మార్కెట్లకు టమాట : పత్తికొండ టమాటా మార్కెట్‌ నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్న టమాట దిగుబడులను రోజూ తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. ఆ మార్కెట్లలో ఇక్కడి పంటకు మంచి గిరాకి ఉండడంతో కొనుగోలు చేసిన సరుకును ఏ రోజుకారోజు గ్రేడింగ్‌ చేసి లారీల్లో తరలిస్తున్నారు. అక్కడ హోల్‌సేల్‌గా రూ.100కు పైగా ధర పలుకుతుండడంతో ఆ మార్కెట్లకే సరుకును పంపుతున్నారు రైతులు.

దిగుబడి పెరిగితే పక్క రాష్ట్రాలకు ఎగుమతి : ప్రస్తుతం దిగుబడులు తక్కువగా ఉండటంతో తెలంగాణలోని మార్కెట్లకు మాత్రమే సరకు తరలిస్తున్నారు. రైతుల నుంచి దిగుబడి పెరిగితే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కర్ణాటక రాష్ట్రంలోని హోసూర్, కృష్ణగిరి ప్రాంతాలకు తరలిస్తామని వ్యాపారస్థులు చెబుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిందని, దీంతో దిగుబడులు భారీగా తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టం నుంచి పూర్తిగా బయటపడతాం : తాను ఎకరం పొలంలో టమాటా సాగు చేశానని, గత నెలలో అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిని, ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని మహబూబ్‌బీ తెలిపారు. దీనికి తోడు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, ఎకరానికి రూ.30వేలు పెట్టుబడి పెట్టానని, దిగుబడులు తగ్గినా, ధరలు ఇలాగే కొనసాగితే నష్టం నుంచి పూర్తిగా బయటపడతామని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతి రైతుకు మేలు జరుగుతుంది : ప్రస్తుతం పంట దిగుబడులు, మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని ఈరన్న అంటున్నారు. మూడు ఎకరాల్లో టమాటా సాగుకు రూ.90 వేలకు పైగా ఖర్చు చేశానని, 2 నెలల పాటు దిగుబడులు బాగా వచ్చినా, ధరలు పూర్తిగా పతనమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, ఈ ధరలతో టమాటా రైతులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇదే ధరలు డిసెంబర్‌ వరకు కొనసాగితే ప్రతి రైతుకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు.

పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.