Tollywood Donations To Flood Victims in Telugu States : 'నేను సైతం తెలుగు ప్రజల కోసం' అంటూ మెగాస్టార్ చిరంజీవి, 'అయిన వాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే నా తెలుగు ప్రజలకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆగను' అంటూ నందమూరి బాలకృష్ణ.. 'నేనున్నాను' అంటూ అక్కినేని నాగార్జున, 'తెలంగాణ నాదే, ఏపీ నాదే' అంటూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. 'నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా' అంటూ అల్లు అర్జున్.. ఇలా యావత్ టాలీవుడ్ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. బాధితులకు అండగా నిలుస్తూ, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు రావాలని ప్రార్థిస్తూ తమకు తోచినంతగా తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేశారు. తెలుగు నటులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు విరాళాలు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
మనందరం ఏదో…
వరద బాధితుల కోసం మేము సైతం : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ హీరోలు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్లు, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ నటులు, త్రివిక్రమ్, వెంకీ అట్లూరి వంటి దర్శకులు, రాధాకృష్ణ, నాగవంశీ లాంటి నిర్మాతలు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. మరోవైపు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా భారీగా విరాళం అందించారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం : అత్యధికంగా డార్లింగ్ హీరో ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.2 కోట్లు ప్రకటించాడు. తెలంగాణ, ఏపీ వరద బాధితులకు చెరో కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రభాస్ టీమ్ తెలిపింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో కోటి రూపాయలతో పాటు ఏపీలో 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ప్రకటించినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున తెలంగాణ, ఏపీకి చెరో రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు ప్రకటించారు.
I'm saddened by the loss and suffering caused by the devastating rains in Andhra Pradesh and Telangana. In these challenging times, I humbly donate ₹1 crore in total to the CM Relief Funds of both states to support the relief efforts. Praying for everyone's safety 🙏.…
— Allu Arjun (@alluarjun) September 4, 2024
ఇక యంగ్ హీరోలు విశ్వక్ సేన్ రూ.10 లక్షలు, సిద్ధూ జొన్నలగడ్డ రూ.30 లక్షలు, అనన్య నాగళ్ల రూ.5 లక్షలు రెండు రాష్ట్రాలకు విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. కల్కితో బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు బంపర్ కలెక్షన్లు సాధించిన వైజయంతీ మూవీస్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.20 లక్షలు ప్రకటించింది. కమెడియన్ అలీ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.6 లక్షలు ఇవ్వగా, నటుడు కోట శ్రీనివాస రావు ఏపీకి లక్ష రూపాయలు ప్రకటించారు.
పవర్ స్టార్ మంచి మనసు - వరద బాధితులకు పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం - PAWAN KALYAN DONATES 6 CRORES
సాయంలోనూ 'బాహుబలి' - తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం - Prabhas Dontaion to Telugu States