ETV Bharat / state

'ఆ పెద్దపులి ఇక్కడి నుంచి వెళ్లలేదు - దిశ మార్చి మళ్లీ వచ్చింది - ఒంటరిగా తిరగకండి' - TIGER ROAMING IN NIRMAL DISTRICT

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్ద పులి సంచారం - పాదముద్రలు సేకరిస్తున్న అటవీ శాఖ అధికారులు

Tiger Wandering In Kuntala
Tiger Wandering In Kuntala Nirmal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 9:30 AM IST

Tiger Wandering In Kuntala Nirmal District : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం వారం రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్‌ బీట్‌ పరిధి వైపు గురువారం పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటే వీలుందని ఇక్కడి అధికారులు మహారాష్ట్ర ఎఫ్‌ఆర్వో, అధికారులకు పులి సంరక్షణ బాధ్యతలను అప్పగించేందుకు నివేదికలు రూపొందించారు. పులి ఇక్కడి నుంచి వెళ్లిందని ఊపిరి పీల్చుకున్న తరుణంలో శుక్రవారం మళ్లీ కుంటాల, హన్మాన్‌నగర్‌ తండా ప్రాంతాల్లో కనబడింది. పులి సంచారాన్ని కొంతమంది ప్రత్యక్షంగా చూడటంతో భయాందోళనలకు గురవుతున్నారు.

కుంటాలలో పులి సంచారం : కుంటాలలో ఉదయపు నడకకు వెళ్లిన విజయ్‌కి పులి కనబడింది. గ్రామానికి అతిదగ్గరగా ఉండటంతో పరుగున చేరుకుని గ్రామస్థులకు ఈ విషయాన్ని తెలిపారు. జక్కుల సతీష్‌ మొక్కజొన్న విత్తనం వేసి నీటితడులిచ్చారు. ఆ చిత్తడిలో, పక్కనే వరి పొలంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. అదే మార్గంలో హన్మాన్‌తండా మీదుగా ఉదయం 8 గంటల సమయంలో పెద్దపులి సంచరిస్తుంది. పులిని పంట పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు గమనించి కేకలు వేస్తూ చెట్టెక్కి కూర్చున్నారు. కొందరు తండాకు చేరుకుని ప్రజలకు తెలిపి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులి తండాలోకి రాకుండా అందరూ కలిసికట్టుగా కేకలు, డబ్బాలతో చప్పుడు చేయడంతో ప్రాథమిక పాఠశాల వెనక వైపు నుంచి అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అధికారులు సైతం పాదముద్రలను సేకరించి నిర్ధారించారు.

అయితే అంబుగాం పరిసరాల్లోని మహారాష్ట్ర సరిహద్దులో సంచరిస్తున్న పెద్దపులి అక్కడ ఇతర పులుల సంచారం ఉన్నట్లు పసిగట్టి వేరే దిక్కు ప్రయాణం మార్చుకుంటుందని భావిస్తున్నారు. ఒక రాత్రి సమయంలోనే సుమారుగా 15-20 కిలోమీటర్ల మేర నడక కొనసాగించింది. కాళేశ్వర్‌ ప్రధాన కాల్వ వెంట జంతువును వేటాడుతూ ఇటు వైపు వచ్చి ఉంటుందని, ప్రస్తుత తరుణంలో పులి ఎదకు వచ్చి తోడు కోసం ఇలా దిశ మార్చుకుంటూ తిరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.

పులి రైతులకు మిత్రుడేనని, దాని సంచారంతో పంటలను నష్టపరిచే అడవి పందులు, మనుబోతులు, ఇతర జంతువులు దరిదాపుల్లోకి కూడా రావని భైంసా ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌ చరవాణిలో తెలిపారు. ఎవరైనా పులికి హాని కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులి సంచరించే ప్రాంతాల్లో విద్యుత్తు కంచెలు, ఉచ్చులు, ఇతరత్రా హానికర పరికరాలు ఉంటే తొలగించాలని తెలిపారు. డీఆర్వో రేష్మ, టాస్క్‌ఫోర్స్‌ డీఆర్వో రాజశేఖర్, ఎఫ్‌ఎస్‌ఓలు కీర్తిరెడ్డి, పూర్ణిమ, ఎఫ్‌బీఓలు, టైగర్‌ మానిటరింగ్‌ మల్లేష్, అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

ఓవైపు చిరుత - మరోవైపు పెద్ద పులి - క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న గ్రామస్థులు

పులిరా పులిరా మగ పులిరా - తాడోబా అడవుల్లో తిరుగుతుందిరా - Tiger Wandering In Kagaznagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.