ETV Bharat / state

పులిరా పులిరా మగ పులిరా - తాడోబా అడవుల్లో తిరుగుతుందిరా - Tiger Wandering In Kagaznagar - TIGER WANDERING IN KAGAZNAGAR

Tiger Wanders in Kagaznagar : తాడోబా అభయారణ్యాల నుంచి వచ్చిన ఎస్-12 పులి కాగజ్​నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తిరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారుల బృందం ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సమీప గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

Tiger Roaming in Komaram Bheem Asifabad
Tiger Roaming in Kagaznagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 2:53 PM IST

Updated : Aug 8, 2024, 3:00 PM IST

Tiger Roaming in Komaram Bheem Asifabad : తాడోబా అభయారణ్యాల నుంచి 25 రోజుల కిందట కాగజ్​నగర్ అటవీ ప్రాంతానికి వచ్చిన ఎస్-12 పులి జనావాసాలకు అతి దగ్గరగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడున్నర ఏళ్ల వయసున్న మగ పులి కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తిరుగుతోంది.

కాగజ్​నగర్​లో పులి కదలికలు : రెండు రోజుల కిందట కనర్గాం, గుండి, పెద్దవాగు దాటి ఆసిఫాబాద్ పట్టణానికి కిలో మీటరు దూరంలో ఉన్న గోవిందపూర్ గ్రామ సమీపంలోని పంట చేలల్లో కనిపించింది. తాజాగా తిర్యాణి మండలం ఎదులపహాడ్ అడవుల సమీపంలో అధికారులకు పులి కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారుల బృందం ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

పరిసర గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంత సమీపంలోని చేలకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఎదుల పహాడ్ నుంచి ఈ పులి రెబ్బెన మీదుగా దహెగాం మండలానికి వెళ్తుందా? అటు నుంచి కవ్వాల్‌కు వెళ్తుందా? అనే కోణంలో అధికారులు పులి అడుగు జాడలను అనుసరిస్తున్నారు. దహెగాంతో పాటు, కవ్వాల్‌కు వెళ్లాలన్నా పులి మళ్లీ నాలుగు వరుసల రహదారిని దాటాల్సి ఉంటుంది.

కుమురం భీం జిల్లాలో మహారాష్ట్ర పులి - ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్న అటవీ ప్రాంతవాసులు

రెబ్బెన- తిర్యాణి మండల సరిహద్దులో పులి సంచారం : మంగళవారం రోజున పులి రెబ్బెన- తిర్యాణి మండల సరిహద్దులో ఉన్న కైరిగూర ఉపరితల గని సమీపంలో ఉందని అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా అటవీ అధికారుల బృందం గాలింపు చర్యలను చేపడుతోంది. చిర్రకుంట సమీపంలో ఉన్న దొంగర్గవ్ చెందిన నాందేవ్ ఆవును ఈ పులి హతమార్చింది. పరిహారంగా రూ.5 వేలను రైతుకు అందించారు.

2019లో ఏ-2పులి సైతం కైరిగూర బొగ్గు ఉపరితల గని ఉన్న చోటే మొదట కనిపించింది. అనంతరం దహెగాం, పెంచికల్​పేట్ మండలాల్లో ఒక యువతిని, యువకుడిని హతమార్చింది. గ్రామాలకు సమీపంలో పంట చేలల్లో తిరుగుతున్న ఎస్-12 పులి నుంచి ప్రజలకు అదే సమయంలో ఇటు పులికి ఎటువంటి ఆపదతలెత్త కుండా ఆటవీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

"పులి కదలికల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. పులి అడుగు జాడలను పరిశీలిస్తూ అక్కడి ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నాం. కాగజ్​నగర్ పెద్దవాగు ప్రాంతాల్లో వందల ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురైనందునే పులి తిర్యాణి అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఈ ఆక్రమణలను క్రమంగా తొలగిస్తాం." -అటవీ అధికారులు

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం - పశువుల కాపరులు ఒంటరిగా తిరగొద్దని పోలీసుల హెచ్చరిక - Leopard Wandering in Medak District

Last Updated : Aug 8, 2024, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.