Three People Drowned in Nizam Sagar Canal : నిజామాబాద్ జిల్లా వర్ని, చందూర్ మండలంలో వేరువేరు ఘటనలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. వర్నిలోని అఫందీఫారం సమీపంలో ఉన్న కాలువలో స్నానం చేయడానికి వెళ్లి నారాయణ అనే యువకుడు ప్రమాదవశాత్తు నీట మునగడంతో, అతన్ని కాపాడబోయి(Helping Someone) విజయ్(50) అనే వ్యక్తి సైతం నీట మునిగి మృతి చెందాడు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా విజయ్ మృతదేహం లభ్యమైంది.
ఒకరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు : మరో ఘటనలో చందూరు మండలంలో నిజాంసాగర్‌లో పడి మరొకరు గల్లంతు అయ్యారు. స్నానం కోసం కాలువలో దిగిన విష్ణువర్ధన్ అనే యువకుడు లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. ఇతడు టీఎస్ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ ఉద్యోగిగా(TSRTC Contract Employee) విధులు నిర్వర్తిస్తున్నాడు. మొత్తంగా స్నానానికని దిగిన ముగ్గురు గల్లంతు కాగా, వారిలో విజయ్ మృతదేహం లభ్యమైంది. నారాయణ, విష్ణువర్ధన్ల కోసం గజ ఈతగాలతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నీట మునిగిన వారి ఆచూకీ లభించక, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Three Youth Drowned in SRSP : జిల్లాలో తరచూ నీట మునిగి మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవల మహాశివరాత్రి(Maha Shivratri) పండుగనాడు నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యి విగతజీవులుగా మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే ముప్కాల్ మండల పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యూలేటరీ వద్ద స్నానానికి దిగిన యువకులు, ఒకరిని కాపాడబోయి ఒకరు నీట మునిగారు.
జక్రాన్‌పల్లి గణ్య తండా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మహాశివరాత్రి సందర్భంగా అద్దెకు కారు తీసుకొని పోచంపాడ్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ శ్రీరాంసాగర్ లక్ష్మీ కాలువ(Sri Ramsagar Lakshmi Canal) హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానానికి దిగి, ముగ్గురు నీట మునిగి, గల్లంతయ్యారు. ఆ ఘటన మరువకు ముందే మరో ఉదాంతం శనివారం వర్ని, చందూర్ మండలాల్లో చోటుచేసుకోవటం స్థానికంగా తీవ్రంగా కలిచివేస్తుంది.
పండుగపూట విషాదం - విహారానికి వెళ్లి ఎస్సారెస్పీలో ముగ్గురు యువకులు గల్లంతు