గౌడవెల్లి వద్ద రైలు ప్రమాదం- ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి మృతి - Three People Died Hit by Train - THREE PEOPLE DIED HIT BY TRAIN
Three People Died Hit by Train : మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుడు రాఘవేంద్రనగర్‌కు చెందిన రైల్వే ట్రాక్‌చెకింగ్ కృష్ణ కుటుంబంగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Published : Aug 11, 2024, 6:22 PM IST
|Updated : Aug 11, 2024, 6:56 PM IST
Three People Died Hit by Train : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఆదివారం సాయంత్రం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి, ఇద్దరు కుమార్తెలను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుడిని మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కృష్ణగా గుర్తించారు. గౌడవెల్లిలో రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌చెకింగ్‌గా పని చేస్తాడని స్థానికులు చెబుతున్నారు.
ఆదివారం కావడంతో తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని పనికి వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా ఇద్దరు కుమార్తెలు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న సమయంలో, రైలు అటుగా రావడం గమనించిన కృష్ణ ఇద్దరు కుమార్తెలను కాపాడబోయి రైలు ఢీకొని మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు పిల్లలను వర్షిత ,వర్షిణిగా స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో దారుణం - భార్య వేధిస్తోందని భర్త బలవన్మరణం!
'నన్ను నమ్మండి నాన్న - నేను ఏ తప్పు చేయలేదు' - లెటర్ రాసి యువతి సూసైడ్ - Young Woman Suicide In AP