Three Men Sexually Assaulted a Woman in Madhura Nagar : పని ఉందంటూ మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన దారుణ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే సోమవారం రాత్రి హైటెక్‌సిటీ క్రాస్ రోడ్‌లోని భవనంలో ఓ మహిళ పని ముగించుకుని వస్తుండగా ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని నమ్మించారు. అందుకు రూ.500 ఇస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన ఆ అమాయకురాలు వారి వెంట వెళ్లింది. ఆమెను యువకులు ఇంటికి తీసుకెళ్లారు.
వాళ్లు మాట్లాడుకున్నట్లుగానే ఆమెకు కొన్ని బట్టలు ఉతకడానికి వేశారు. ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా ఆ యువకులు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో పక్కింటివారు వచ్చేసరికి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధితురాలు మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ముగ్గురు యువకులు ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యువకుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. మహిళను భరోసా కేంద్రానికి తరలించారు.
కోరిక తీర్చమంటూ బలవంతం - ప్రతిఘటించడంతో మహిళపై అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు
"సోమవారం రాత్రి మహిళ వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. హైటెక్ బస్ స్టాప్ దగ్గర పని చేసుకుని వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఇంటి దగ్గర బట్టలు ఉతికే పని ఉందని దానికి మేము రూ.500 ఇస్తామని చెప్పారు. దానికి ఆమె అంగీకరించి బట్టలు ఉతకడానికి వాళ్ల ఇంటికి వెళ్లింది. బట్టలు ఉతికే క్రమంలో ఆమె ఇంట్లోకి వెళ్లింది. దీంతో వాళ్లు ఇంటి గడియ పెట్టి ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ముగ్గురు యువకులు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నాం. ఆమెను భరోసా కేంద్రానికి పంపించాం." - శ్రీనివాస్, మధురానగర్ ఇన్స్పెక్టర్
'కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని లైంగికంగా వాడుకున్నారు' : ఆ మాజీ మంత్రిపై రేప్ కేసు
సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన - మైనర్ బాలికపై యువకుల సామూహిక అత్యాచారం