ETV Bharat / state

కౌంట్ డౌన్ స్టార్ట్ - మరో 24 గంటల్లో రైతులకు రూ.2 లక్షల రుణం మాఫీ - LOAN WAIVER THIRD INSTALLMENT - LOAN WAIVER THIRD INSTALLMENT

Third Phase Crop Loan Waiver in Telangana : రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీ కోసం సర్కారు సిద్ధమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే లక్ష నుంచి లక్షన్నర రూపాయలలోపు రుణమాఫీ చేసింది. ఈ నెల 15న మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 7:58 AM IST

CM Revanth Will Release Third Phase Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది.

జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11 లక్షల 14 వేల 412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణం కలిగి ఉన్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది.

తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా : దాదాపు 6 లక్షల 40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి రాగానే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. రూ.2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రైతుల ఎదురుచూపులకు తెర - తెలంగాణలో రుణమాఫీ పండుగ - Debate on Crop Loan Waiver in TG

రూ.2 లక్షల రుణమాఫీకి రేవంత్​ సర్కార్ గ్రీన్​ సిగ్నల్​​ - ఎవరెవరు అర్హులో మీకు తెలుసా? - TG Cabinet Approval Runamafi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.