ETV Bharat / state

ప్రేమించి పెళ్లి చేసుకుంది - ఆ బంధానికి అడ్డొస్తున్నాడని అంతమొందించింది

అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నం - ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డ కీర్తి

MURDER CASE IN NAGARKURNOOL
హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 6:50 PM IST

The Wife Killed her Husbund : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి, పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సహకరించిన మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను నాగర్​కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, 2011లో కీర్తీ, జగదీష్​లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నాగర్​కర్నూల్​లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. జగదీష్ బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. బిజినపల్లి మండలంలో గుడ్లనర్వ గ్రామానికి చెందిన నాగరాజుతో కీర్తికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త తప్పుదారి పట్టి, వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంపై కీర్తి, జగదీష్​ల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

హత మార్చాలనే ఆలోచన : కీర్తి ప్రియుడు నాగరాజుకు కూడా తన భార్యతో ఈ వివాహేతర సంబంధంపై గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలకు ముగింపు పలకాలని కీర్తి, నాగరాజులు నిర్ణయించుకున్నారు. కీర్తి భర్త జగదీష్​ను హతమార్చితే తమ సంబంధానికి అడ్డు ఉండదని భావించారు. కీర్తి, నాగరాజు నవంబర్​ 25వ తేదీన పథకం ప్రకారం మత్తు మందు కలిపిన మద్యాన్ని జగదీష్​కు తాగించారు.

అయినా జగదీష్ చనిపోకపోవడంతో సమీపంలో ఉన్న కేఎల్​ఐ కాలువలోకి తీసుకెళ్లి అందులో ముంచి అతనికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా కనిపించడం లేదంటూ కీర్తి నాటకం ప్రారంభించింది. ఆ తర్వాత వెంటనే కేఎల్​ఐ కాలువలో ఒక మృతదేహం దొరికింది. అది జగదీష్​దే అని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్​లో దొరికిన ఆధారాలతో విచారణ ప్రారంభించారు.

వెలికితీసే కొద్దీ నిందితులే : ముందుగా జగదీష్​ భార్య కీర్తిని విచారించిన పోలీసులు, అన్ని నిజాలను తెలుసుకున్నారు. జగదీష్ హత్యకు భార్య కీర్తితో పాటు ఆమె ప్రియుడు నాగరాజు, ఆమె తల్లి పద్మ కూడా సహకరించినట్లు కనిపెట్టారు. మత్తు పదార్థాలు అందించి హత్యకు సహకరించిన శివ, సుధాకర్, మోహన్, సాయికుమార్​ల ప్రమేయం కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం ఏడుగురు వ్యక్తులు జగదీష్ హత్య కేసులో ఉన్నట్టు దర్యాప్తులో తెలుసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్​కు తరలిస్తున్నట్లు నాగర్​కర్నూల్ డీఎస్పీ తెలిపారు.

ఒంటరి మహిళలే ఆ 'సీరియల్‌ కిల్లర్‌' టార్గెట్‌ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు?

భార్యపై అనుమానంతో హత్య - ఆపై అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.