The Sleep Company Founder Priyanka Salot Yuva Story : పగలంతా పనిచేసి రాత్రి ఓ కునుకు తీస్తే కాస్త ఉపశమనంతో పాటు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మారుతున్న జీవన పరిణామాల దృష్ట్యా చాలా మంది బెడ్స్‌పై నిద్ర పోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దానినే తన వ్యాపారానికి ఆదరువుగా చేసుకుంది ఈ యువతి. మార్కెట్లో దొరికే వాటిలాగా కాకుండా భిన్నంగా పరుపులను తయారు చేస్తూ ఫోర్చూన్ ఇండియా 2022లో చోటు దక్కించుకుంది.
తను తయారు చేసిన ప్రొడక్ట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న ఈ యువతి పేరు ప్రియాంక సలోట్. ముంబయి స్వస్థలం. కలకత్తాలోని ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత పీ అండ్జీ అనే మార్కెటింగ్ సంస్థలో ఆరేళ్లపాటు ఉద్యోగం చేసింది. అయితే ఈమె గర్భిణీగా ఉన్న సమయంలో సరైన నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొంది. దానికి తోడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడింది. గర్భిణీగా ఉన్న సమయంలో సరైన పరుపు లేక ప్రియాంక సలోట్కి కంటి నిండా నిద్ర కరవైంది.
The Sleep Company Smart Ortho : ఈమెతో పాటు పుట్టిన పాపకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రకాల పరుపులు మార్చి నిద్రపోయినా ఈమెకు ఉపశమనం మాత్రం దొరకలేదు. దాంతో తానే స్వయంగా పరుపులు తయారు చేయాలని తలచింది. తాను పడ్డ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సౌకర్యవంతమైన పరుపులను తయారు చేయాలనుకుంది సలోట్. తన ఆలోచనను భర్తతో పంచుకుంది.
అతను సానూకూలంగా స్పందించడంతో డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న స్నేహితుడు త్రిపాఠి కలిసి మార్కెట్లో దొరికే పరుపులపై పరిశోధన చేసింది. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిద్రతో పాటు ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ద స్లీప్ కంపెనీ పేరుతో పరుపులను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రియాంక చెబుతోంది.
"నేను గర్భిణీగా ఉన్నప్పుడు, నాకు పాప పుట్టిన సమయంలో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. రాత్రి సమయంలో నిద్ర పట్టేది కాదు. అప్పుడు దేశంలో ఉన్న చాలా రకాల పరుపులను ఆర్డర్ చేశాను. కానీ ఏ పరుపు వల్ల నా వెన్నునొప్పి తగ్గకపోగా నిద్రకూడా వచ్చేది కాదు. ఆ సమయంలో నేను భారత్‌లో ఉన్న పరుపులను యూఎస్ఏ, యూరప్ వంటి దేశాల్లో వినియోగించే బెడ్స్‌తో పోల్చి చూశాను. ఆ సమయంలో డీఆర్డీవో శాస్త్రవేత్తగా ఉన్న నా మిత్రుడు త్రిపాఠి సాయంతో మనుషులు సరైన నిద్రపోవడంపై పరిశోధన చేశాము. మేము అనుకున్న టెక్నాలజీని రూపొందించడానికి సుమారు రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేశాము." - ప్రియాంక సలోట్, ద స్లీప్ కంపెనీ ఫౌండర్
వెన్నునొప్పికి దన్నుగా వ్యాపారం : 2019లో ద స్లీప్ కంపెనీ ప్రారంభానికి ముందు మార్కెట్లో లభించే పరుపులపై పరిశోధన చేసినట్లు ప్రియాంక చెబుతోంది. దీనికోసం దేశ విదేశాల్లో ఉన్న పరుపులు, వాటికి ఉపయోగిస్తున్న పరిజ్ఞానం, ముడి సరుకు, నిద్ర సమయంలో వస్తున్న సమస్యల గురించి అధ్యయనం చేశానంటోంది. ఫలితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 2 సంవత్సరాలు కష్టపడి ఈ కంపెనీని ప్రారంభించానని చెబుతోంది. కంపెనీ ప్రారంభించన ఆదిలోనే ప్రియాంకకు ఎదురుదెబ్బ తగింలింది.
Best Online Mattress : 2019లో కరోనా రావడంతో కంపెనీ మార్కెటింగ్ తగ్గింది. కానీ, ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకెళ్లింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా 75 స్టోర్లను ప్రారంభించి స్వయంగా నడిపిస్తోంది. గాఢ నిద్ర రావడం కోసం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఈ పరుపులలో ఉపయోగించినట్లు చెబుతోంది ప్రియాంక. స్టోర్లతో పాటు స్లీప్ మాట్రెస్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని ఈ యువ వ్యాపారవేత్త అంటోంది.
ఎదురైన సమస్యనే వ్యాపార సముదాయం : పరుపులు, రిక్లైనర్ పరుపులు, దిండ్లు, కుర్చీలు, సోఫాలు వంటివి విక్రయిస్తున్నట్లు చెబుతోంది. వీటి ద్వారా సంవత్సారానికి రూ.350 కోట్లకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నానని వివరిస్తోంది. వ్యాపారంలో భర్తే భాగస్వామి కావడం తనకు కలిసోచ్చిందని చెబుతోంది. ఎదురైన సమస్యనే వ్యాపార సముదాయంగా మార్చుకుంది ప్రియాంక. తన ప్రతిభతో ఫోర్చూన్ ఇండియా 2022లో చోటు దక్కించుకుంది. దాంతోపాటు ప్రేమ్జీ, ఫైర్సైడ్ వెంచర్స్లాంటి పేరొందిన సంస్థల నుంచి పెట్టుబడులను సాధించింది. భారత్ కేంద్రంగా విదేశాలకు కూడా ద స్లీప్ కంపెనీ మ్యాట్రెస్‌ను ఎగుమతి చేయడమే లక్ష్యమంటోందీ మహిళా వ్యాపారవేత్త.
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ టిప్స్ పాటిస్తే డీప్ స్లీప్ పక్కా! - Tips to improve your sleep cycle
కొత్త పరుపు కొనుగోలు చేస్తున్నారా? - ఈ విషయాలు మరిచిపోవద్దు! - Tips To Choose Good Mattress