Chhattisgarh Encounters : భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మూడు మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మూడుచోట్ల బీరు సీసాల్లో మందు పాతర (ఐఈడీ-ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లను అమర్చారు. కూంబింగ్‌కు వెళుతున్న భద్రతా బలగాలు మందుపాతరలను గుర్తించి వెలికితీసి నిర్వీర్యం చేశాయి. చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనికి కారణం తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ప్రతిరోజు మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. కాగా గత నెల సెప్టెంబర్‌లో దండకారణ్యంలో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. వీరిలో అగ్రనాయకత్వం ఉన్నట్లు కూడా తెలిసింది. ఒక్కొక్కరి తలపై రివార్డు కూడా ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మావోయిస్టుల వ్యూహాలు మాత్రం ఫలించడం లేదు.
ఆపరేషన్ కగార్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కేంద్ర బిందువైన అబూజ్మడ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు టార్గెట్ చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను శాశ్వతంగా 2026 సంవత్సరం నాటికి నిర్మూలించడానికి భద్రతా బలగాలు అడవుల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొన్నారు.
'ఆపరేషన్ చేయూత' ఎఫెక్ట్ - లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు - six Maoist Members Surrender
మావోయిస్టులపై ముప్పేట విరుచుకుపడుతున్న భద్రతా బలగాలు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారన్న దానిపై కూడా లెక్కలు తీస్తోన్నాయి. వారికి తగిన ప్రోత్సాహకాలు కల్పించి వీరు ఎలాగైనా జన జీవనస్రవంతిలో కలిసేలా చూడాలని తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారని తేల్చేందుకు ప్రయత్నిస్తోంది.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి కేవలం నామమాత్రంగానే మారింది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే వీరు బలంగా ఉన్నారు. మావోయిస్టులకు పెట్టనికోటలా చెప్పుకొనే ఇక్కడి దండకారణ్యంపై గత కొద్ది రోజులుగా భద్రతా బలగాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి 4 కిలోమీటర్లకు ఓ పోలీసు క్యాంపు ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్నారు. వీటితోపాటు కేవలం మావోయిస్టులపై పోరాడేందుకు ప్రత్యేక భద్రతా బలగాలతో కూడిన క్యాంపులు 47 ఏర్పాటు చేయగా త్వరలో మరో 16 సిద్ధం చేస్తున్నారు.
Maoists Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్- 36 మంది మావోయిస్టులు మృతి - Chhattisgarh Encounter Today